తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది.  టిడిపి ఓటమికి గల కారణాల గురించి విశ్లేషించుకుంది ఆ పార్టీ. టిడిపి ఓటమికి కారణాలు అనేకం ఉన్నాయని చంద్రబాబు నాయుడు చెప్పిన సంగతి తెలిసిందే.  ఆ కారణాలు ఏంటి అన్నది స్పష్టంగా చెప్పలేదు. 


అయితే, టిడిపి ఓటమికి గల కారణాలను సినీ హీరో సుమన్ విశిదీకరించారు.  తెలుగుదేశం పార్టీ ఓటమికి ఒకరకంగా పవన్ కళ్యాణ్ కారణం అని అంటున్నాడు.  తెలుగుదేశంపై ఎన్నికల ముందు జనసేన  అధిపతి పవన్ కళ్యాణ్ పలు అవినీతి ఆరోపణలు చేశారు. 


అయితే టీడీపీ కంటే ఎక్కువగా ఆయన జగన్ పై అనేక ఆరోపణలు చేశారు. ఏనాడూ అధికారంలో లేని జగన్ పై పవన్ చేసిన విమర్శలు జగన్ కి నష్టం చేయకపోగా పవన్ కి టీడీపీకి నష్టం చేశాయని వాదన ఉన్న నేపథ్యంలో సుమన్ వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి.


టిడిపి ఓటమికి అసలు ఇదే కారణం అని అంటున్నారు.  ఏది ఏమైనా ఇప్పుడు ఎన్ని రివ్యూలు చేసుకున్నా ఉపయోగం ఏముంటుంది.  తెలుగుదేశం ఓడిపోయింది.  రిజల్ట్ ను ఎవరూ మార్చలేరు కదా.  


మరింత సమాచారం తెలుసుకోండి: