నీతి ఆయోగ్ కార్యక్రమంలో దేశంలోని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు.  ఆయా రాష్ట్రంలోని సమస్యల గురించి నీతి ఆయోగ్ నుంచి ప్రస్తావించారు.  రాష్ట్రంలో ఉన్న సమస్యలు, ఆర్ధిక విషయాలు, బడ్జెట్ గురించి తీసుకోవలసిన చర్యల గురించి ముఖ్యమంత్రులు నీతి ఆయోగ్ కు వివరిస్తారు.  


దీనిని బట్టి నీతి ఆయోగ్ ఓ నిర్ణయం తీసుకుంటుంది.  ఈ నీతి ఆయోగ్ లో జగన్ కోరికల చిట్టాను విప్పారు.  ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు.  ఎందుకు ఇవ్వరు అని ప్రశ్నిస్తూనే.. ఇవ్వాల్సిన ఆవశ్యకత గురించి కూడా మోడీ ముందు ఉంచారు.  


ప్రత్యేక హోదా విషయంలో మోడీ మీద ప్రశ్నల వర్షం కురిపించారు. ఆ సమయంలో మోడీ నోటా మాట కూడా రానంతగా ప్రశ్నలను సంధించారు జగన్. నీతి ఆయోగ్ సదస్సులో చాన్స్ దొరికిందే చాలు అన్నట్లు హోదా ఎందుకు ఇవ్వరంటూ దేశంలోని సీఎం లు మొత్తం చూస్తుండగా మోడీకి కడిగేసినంత పని చేశారు జగన్. 


మాకు ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వరు, దానికి మేము అర్హులం కాదా అని జగన్ ప్రశ్నించడంతో మోడీ ఆలా నివ్వెరపోయి మరీ చూస్తుండిపోయాడు. జగన్ మాటలను నీతి ఆయోగ్ సీరియస్ గా తీసుకుంటుందా.. హోదా విషయంలో మోడీ ఇప్పటికే చాలా స్పష్టమైన నిర్ణయం చెప్పారు.  కానీ, మళ్ళీ మళ్ళీ అదే ప్రశ్నను అడిగితె అదే సమాధానం వస్తుందిగాని మరొకటి రాదుకదా.  


మరింత సమాచారం తెలుసుకోండి: