కొత్త ప్రభుత్వం పట్టుమని పదిరోజులు కూడా కాలేదు.. అప్పుడే ప్రతిపక్షంలో ఉన్న నేతలు విమర్శించడం మొదలుపెట్టారు.  సెక్యూరిటీని తగ్గించడం నుంచి, ఎయిర్ పోర్ట్ లో తనిఖీల వరకు అన్ని ఇలాగే చేస్తున్నారు.  కొత్త ప్రభుత్వం ఏర్పాటు జరిగి కేవలం పదిరోజులు మాత్రమే అయింది.  


ఆరు నెలల వరకు ప్రభుత్వం గురించి ఏమి మాట్లాడకూడదని బాబు చెప్తుంటే.. కార్యకర్తలు మాత్రం రెచ్చిపోతున్నారు.  బాబుగారికి ఎయిర్ పోర్ట్ లో అన్యాయం జరిగిందని ఒకటే ఆవేదన.  మాజీ ముఖ్యమంత్రిని ఇలా తనికీ చేయడం ఏంటని అంటున్నారు.  


చంద్రబాబు ధర్మరాజు, వైసీపీ కౌరవులు ఇల్లా బుద్దా వెంకన్నలు వగైరా వగైరాలు అంతా గొంతు చించుకుంటున్నారు. అయితే అధికారంలో లేని వారికి మరియు మాజీ ముఖ్యమంత్రులందరికి కూడా వీఐపీ హోదా ఉండదని కూడా కనీసం తెలుగు తమ్ముళ్లకు తెలియదా అని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.  


ఇలా ప్రతి చిన్న విషయానికి ఇలా రెచ్చిపోయి కార్యకర్తలు మాట్లాడితే.. ఈ వ్యవహారం ఎక్కడికి దారితీస్తుందో అని భయపడుతున్నారు నేతలు.  ఇప్పటికైనా కొంత సమయం పాటు కామ్ గా ఉంటె అన్ని సర్దుకుంటాయని అంటున్నారు.  మరి చూద్దాం ఏం జరుగుతుందో.  


మరింత సమాచారం తెలుసుకోండి: