మాట్లాడే సమయంలో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.  అందులోను పదవుల్లో ఉన్న వ్యక్తులు మాట్లాడే సమయంలో ఎలాంటి తప్పులు దొర్లకుండా.. జాగ్రత్తలు తీసుకొని, ఒకటికి నాలుగుమార్లు చూసుకొని మాట్లాడాలి.  లేదంటే అనేక ఇబ్బందులు వస్తాయి.  జగన్ మొదటి నుంచి ఒకటే మాట చెప్తున్నాడు. అవినీతి రహిత పాలనను అందించాలి. 


స్వచ్ఛతకు వైకాపా ప్రభుత్వం మారుపేరుగా ఉండిపోవాలని అంటున్నాడు.  మంత్రులు, అధికారులు అదే తీరుగా పనిచేయాలని హెచ్చరిస్తున్నాడు.  అవినీతి గురించి ఎన్నిమార్లు మాట్లాడటంతో.. మంత్రులకు అవినీతి అనే మాట మనసులో నాటుకుపోయింది.  


మాట్లాడే సమయంలో అవినీతి రహిత పాలన అందించడమే ధ్యేయం అని చెప్పబోయే అవినీతి చేయడమే ప్రభుత్వం లక్ష్యం అని చెప్పి ఇరుకున పడింది ఏపి డిప్యూటీ ముఖ్యమంత్రి.  విజయనగరం జిల్లాకు వచ్చిన డిప్యూటీ ముఖ్యమంత్రిగారు .. 


పొరపాటున మాట్లాడి నాలిక్కరుచుకున్నారు.  మాట్లాడిన విషయం ఏంటో తెలిసే సరికి జరగాల్సిన నష్టం మొత్తం జరిగిపోయింది.  వైకాపా మనసులోని మాటను ఇలా బయటపెట్టారని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: