పార్టీకి విధేయులుగా ఉన్న వ్యక్తులకు మంత్రి పదవులు ఇచ్చారు జగన్.  అలాగే పదవులు దక్కని వారికి నామినేటెడ్ పోస్టులు కూడా కట్టబెట్టారు.  నామినేటెడ్ పదవులు అంటే అవేమి తక్కువా కాదు.  వాటికోసం ఖచ్చితంగా పనిచేస్తే.. మంత్రి పదవులతో సమానం.  


నామినేటెడ్ పదవుల్లో మొదటి పదవీ రోజాను అలంకరించింది.  రోజాకు ఏపిఐఐసి పదవి లభించింది.  ఎన్నో సవాళ్లతో కూడుకొని ఉన్న ఈ చైర్మన్ పదవిని రోజా డీల్ చేస్తుందో చూడాలి.  ఇదిలా ఉంటె, చైర్మన్ పదవితో పాటు ఆమెకు మరో పదవి కూడా ఉన్నది పార్టీలో.  


ఆమె మహిళా  అధ్యక్షురాలు.  అసెంబ్లీలో తన వాయిస్ ను స్ట్రాంగ్ గా వినిపిస్తుంది.  ఇదిలా ఉంటె, రోజాకు నామినేటెడ్ పదవికి ఎంపికయ్యాక... కామెడీ షో జబర్దస్త్ చేస్తుందా లేదంటే రాజకీయాల్లో ఫుల్ టైం ఉండాలి కాబట్టి అక్కడే ఉంటూ జబర్దస్త్ ను పక్కన పెడుతుందా చూడాలి.  


అయితే గతంలో జబర్దస్త్ ను పక్కన పెట్టె ఆలోచన లేదని స్పష్టం చేసింది.  మరి రోజా ఈ ఆలోచనను అలాగే కొనసాగిస్తుందా లేదంటే..జబర్దస్త్ కు స్వస్తి పలుకుతుందా చూద్దాం.  


మరింత సమాచారం తెలుసుకోండి: