పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్ల ఓటమికి కారణాలు తెలిసిపోయాయి.  పవన్ కు ఓటు వేస్తె టిడిపి కి ఓటు వేసినట్టే అనే ప్రచారం జరగడంతో పవన్ కు బదులుగా ఓటర్లు వైకాపాకు వేసి గెలిపించారు.  ఇదిలా ఉంటె, జనసేన నుంచి ఒక్కరే గెలిచి అసెంబ్లీ వెళ్లారు.  


ఇకపోతే, తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారు.  వైకాపా వైపుకు వాళ్ళు చూస్తున్నారు.  ఒకవేళ వైకాపాలో చేరాలి అంటే రాజీనామా చేసి రావాలి.  వైకాపాలో జాయిన్ అయితే, అక్కడి నుంచి గెలవడం ఈజీ అవుతుంది కాబట్టి రాజీనామా చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు.  


దీనిని పవన్ వినియోగించుకుంటే మంచిది. ఎందుకంటే, పవన్ కళ్యాణ్ కు దేశంలో అన్ని ప్రాంతాల్లోను మంచి పేరు ఉంది.  ఎక్కడి నుంచైనా పోటీ చెయ్యొచ్చు.  ఎమ్మెల్యేలు రాజీనామా చేసి వైకాపాలోకి వస్తే.. ఆయా నియోజక వర్గాలకు ఎన్నికలు జరుగుతాయి.  


సో, పవన్ ఏదో ఒక నియోజక వర్గాన్ని ఎంచుకొని పోటీ చేస్తే..  ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంది.  కాబట్టి పవన్ పోటీ చెయ్యొచ్చు.  గెలిచి అసెంబ్లీకి వెళ్లొచ్చు.  మరి ఇది జరుగుతుందంటారా.  ఏమో చెప్పలేం కదా.  


మరింత సమాచారం తెలుసుకోండి: