కేరళలో విషాదకరమైన సంఘటనొకటి జరిగింది. అళప్పుజ జిల్లాలో ఓ మహిళా కానిస్టేబుల్ ను సహచర కానిస్టేబులే హత్య చేయడం భిన్న అనుమానాలకు దారి తీస్తోంది. వల్లికుణ్ణం పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్న సౌమ్య పుష్కరన్ (32)కు భర్త సంజీవ్, ఇద్దరు పిల్లలున్నారు. సంజీవ్ ఉద్యోగ రీత్యా  విదేశాల్లో ఉంటున్నాడు. అయితే సౌమ్య ఓ కార్యక్రమానికి హాజరై తన నివాసానికి వెళుతుండగా, అజాజ్ అనే ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆమెను వెంబడించి మరీ కిరాతకంగా హత్య చేశాడు.

 

ఏదిఏమైనా ఇదొక అనైతిక చర్య. మొదట ఆమె స్కూటీని తన కారుతో ఢీకొట్టాడు. దాంతో సౌమ్య కిందపడిపోయింది. ఆమె పరిగెత్తేందుకు ప్రయత్నించగా, తన వద్ద ఉన్న కత్తితో విచక్షణరహితంగా పొడిచాడు.  ఆ పెట్రోల్ ను పోసి నిప్పంటించాడు. దాంతో సౌమ్య అక్కడిక్కడే ప్రాణాలు వదిలింది. ఈ ఘటనలో అజాజ్ కు కూడా కాలినగాయాలయ్యాయి. అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.

 

రానురాను ఆకతాయిల ఆగడాలు పెచ్చుమీరిపోతున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, మహిళలపై అరాచకాలు పెరిగిపోతున్నాయి. కారణాలేమైనా, రకరకాల రీతులలో స్త్రీలపై దాడులు జరుగుతూనే వున్నాయి. నిన్న మొన్నటివరకు తమిళనాడులో నేడు కేరళలో... ముఖ్యంగా సమాజం సిగ్గుపడాల్సిన విషయం ఏమిటంటే, జనాలకు అండగా ఉండాల్సిన పోలీసులే అదుపు తప్పి పెచ్చు మీరు పోతున్నారు. ఇటువంటి చర్యలపై కేంద్రం కఠినతరమైన రూల్స్ పాటించకపోతే నవతరం ఇంకా నీరుగారిపోతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: