వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక దూసుకుపోతున్నాడు.  తనదైన మార్క్ ను చాటుకుంటున్నాడు.  అన్ని ప్రజలకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటున్నా.. ఎక్కడో ఒకచోట ఏదో ఒక రగడ జరుగుతూనే ఉన్నది.  పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునే సమయంలో చిన్న చిన్న వాటిని పట్టించుకోరు. 


ఈ చిన్నవే చిలికిచిలికి గాలివానలా మారిపోతాయి.  ఫలితంగా ఇబ్బందులు వస్తాయి.  వైకాపా పార్టీకి అవి కళంకితంగా మారతాయి.  వచ్చే ఎన్నికల నాటికి అవే ప్రతిపక్షాలకు ఆయుధంగా మారతాయి.  సో, చిన్నదే కదా అని వదిలిస్తే.. అవి గాలివానలా ఎదురై ముంచెయ్యకముందే అరికట్టాలి.  


రాయలసీమలో వైకాపా కార్యకర్తలపై ఎలాంటి దాడులు జరగకూడదని చెప్పి.. జగన్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.  అక్కడ కాకపొతే ఇంకోచోట జరుగుతాయి.  ఇప్పుడు అదే జరిగింది.  రాజకీయాలకు హార్ట్ పాయింట్ ఆయిన గుంటూరు జిల్లాలో.. ఇంకా చెప్పాలి అంటే.. అమరావతికి కూతవేటు దూరంలో తెలుగుదేశం పార్టీకి ఓటు వేశారని పిన్నెల్లి గ్రామానికి చెందిన రైతులను వైకాపాకు చెందిన కొందరు దాడులు చేశారట. 


దాడి చేయడమే కాదు.. వాళ్ళను గ్రామం నుంచి బయటకు పంపించేశారట.  ఐదేళ్ల పాటు గ్రామంలోకి వస్తే చంపేస్తామని బెదిరించినట్టు సమాచారం.  ఇది చిన్నదే కదా, ఈ ఒక్క గ్రామంలో మాత్రమే కదా అని వదిలేస్తే.. రేపు మరోచోట జరుగుతుంది.  ఇంకోచోట జరుగుతుంది.  కాబట్టి దీనిపై దృష్టి సారిస్తే మంచిది. 


మరింత సమాచారం తెలుసుకోండి: