జగన్ హోదా మారింది. కానీ ప్రత్యేక హోదా మీద ఆయన స్టాండ్ మాత్రం అలాగే ఉంది. విపక్ష నేత అయినా, సీఎం అయినా తనకు హోదావే ముఖ్యమన్నది జగన్నినాదం. ఇందుకోసం ఎంతదాకా వెళ్ళేందుకు రెడీ అంటున్నారు జగన్. అక్కడ ఉన్నది మోడీ అయినా ఢీ కొడతానని క్లారిటీగా చెప్పేస్తున్నారు.


విభజన లో హోదా గురించి ముఖ్యమంత్రిగా ఎవరూ ఇంతకు ముందు గట్టిగా వాదించిన దాఖలలు లేవు. ఆధారసహితంగా జగన్ నీతి ఆయోగ్ లో వివరించిన తీరుకు సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. హోదా ముగిసిన అధ్యాయం అన్న వారికి చెంప‌ పెట్టులా  జగన్ 14వ ఆర్ధిక సంఘం హోదా ఎపుడూ రద్దు చేయలేదన్న దాన్ని అప్పటి అధ్యక్షుడు అభిజిత్ సేన్  రాసిన లేఖను కూడా జగన్ నీతి ఆయోగ్ లో చదివి వినిపించడం. ఆ కాపీని నీతి ఆయోగ్ ని అందించడం విశేషం.


ఏపీకి హోదా ఇస్తే మిగిలిన రాష్ట్రాలు ఎందుకు అడుగుతాయంటూ జగన్ లాజికల్ గా వేసిన మరో ప్రశ్న సైతం కేంద్రంలోని పెద్దలకు కలవరపాటు కలిగించేదే. ఉమ్మడి ఏపీని విభజిస్తూ ఇచ్చిన హామీ ఇది. అందువల్ల పూర్తిగా నష్టపోయిన ఏపీకి హోదా షరతు గా పెట్టి విడగొట్టారు అందువల్ల మిగిలిన రాష్ట్రాలతో ఏపీకి పోలిక ఏంటి. ఇదీ జగన్ వాదన. అదిరిపోయిందిగా. బీజేపీని సైతం రాజకీయంగా జగన్ ఇరుకున పెట్టేలా ప్రసంగం చేశారు. మీరు ప్రతిపక్షంలో ఉన్నపుడు ఏపీని విడగొట్టి ప్రత్యేక హోదాకు మద్దతు ఇచ్చారు.


వెంటనే అధికారంలోకి వచ్చింది మీరు, ఎన్నికల హామీగా ప్రత్యేక హోదా అంశాన్ని పెట్టింది మీరు ఇపుడు ఇవ్వనంటే ఎలా అంటూ ఏకంగా మోడీనే నిలదీశారు జగన్. మాకు హోదావే కావాలి. మరేం వద్దు అంటూ క్లారిటీగా జగన్ చెబుతూంటే ఢిల్లీ పెద్దలకు ఏం తోచలేదన్నది వాస్తవం. ఏది ఏమైనా  జగన్ హోదా విషయంలో ఎంత పట్టుదలగా ఉన్నారన్నది తొలి ఢిల్లీ టూర్లోనే స్పష్టం చేశారు. ఇక ఇవ్వకపోతే తప్పు కేంద్రానిదే అవుతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: