ఇపుడున్న రాజకీయ వేడిలో ఇద్దరు రాజకీయ నాయకులే కలసుకోవడం కష్టం. ఇక రాజ్యాధికారం చేత పట్టుకుని అపరిమితమైన అధికారాలు, హోదాను అనుభవిస్తున్న వారు ఒకే చోట కలవడం అంటే అది చాలా  కష్టం. కానీ కొన్ని సార్లు అది సాధ్యపడుతుంది. అలాంటిదే ఓ రేర్ ఫీట్ ఏపీలో కనిపించనుంది.


విశాఖ శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర ఉత్తరాధికారి నియామక కార్యక్రమం విజయవాడ కరకట్ట వద్ద మూడు రోజుల పాటు ఘనంతా సాగుతోంది. ముగింపు కార్యక్రమం ఈ నెల 17న జరగనుంది. దానికి ఏపీ, తెలంగాణా, ఒడిషా ముఖ్యమంత్రులు హాజరవుతారని అంటున్నారు. ఇప్పటికే జగన్, కేసీయార్ వస్తారన్నది ఖాయమైనా ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ రావడం విశేషం. ఇలా క్రిష్ణా తీరాన ముగ్గురు సీఎంలు కలవడం గొప్ప పరిణామమే.


అదే విధంగా గవర్నర్ నరసిమ్హన్  కూడా వస్తున్నారు. ఇక పోతే ఈ ముగ్గురు సీఎం లు కలుసుకుంటే అది చరిత్ర అవుతుంది. మూడు రాష్ట్రాలో ఉన్న సమస్యలపైన కొంత వరకైనా అవగాహనకు వస్తే అది రికార్డ్ అవుతుంది. జగన్ సీఎం అయ్యాక పొరుగు సంబంధాలు బాగుపడ్డాయి. ఇపుడు అవి మరింతగా ముందుకు వెళ్తున్నాయని అంతా అనుకుంటున్నరు.


మరింత సమాచారం తెలుసుకోండి: