దశాబ్దాల తరబడి పెండింగ్ లో ఉన్న డిమాండ్ ఒక్కసారిగా అమల్లోకి వచ్చేసింది. పోలీసు శాఖలో వీక్లీ ఆఫ్ సౌకర్యం అమల్లోకి వచ్చేసింది. జగన్మోహన్ రెడ్డి అలా ఆదేశించారో లేదో ఉన్నతాధికారులు ఇలా అమల్లోకి తెచ్చేశారు. గతంలో కూడా సిఎంలు ఆదేశాలు ఇచ్చినా అమలుకు నోచుకోలేదు. మొట్టమొదటసారిగా తమకు వీక్లీ ఆఫ్ సౌకర్యం అమల్లోకి రావటంతో వేలాదిమంది పోలీసులు ఫుల్లు హ్యాపీగా ఉన్నారు.

 

ఎందుకంటే వాళ్ళ ఆదేశాల్లో చిత్తశుద్ది లేదు. కానీ జగన్ ఇచ్చిన ఆదేశాల్లో చిత్తశుద్దిని గమనించిన ఉన్నతాధికారులు వీక్లీ ఆఫ్ సౌకర్యాన్ని ఈ శనివారం నుండే అమల్లోకి తెచ్చారు. పాదయాత్ర సందర్భంగా జగన్ ను కలసిన పోలీసు కానిస్టేబుళ్ళ సంఘం నేతలు వీక్లీ ఆఫ్ డిమాండ్ ను ప్రస్తావించారు. వాళ్ళ సమస్యను విన్న జగన్ వాళ్ళడిగినట్లుగా వీక్లీఆఫ్ సౌకర్యాన్ని అమల్లోకి తెస్తానని అప్పట్లో హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోగానే ఆదేశాలిచ్చారు.

 

మామూలుగా పోలీసు శాఖలో వీక్లీఆఫ్ లు సాధ్యం కాదు. ఎందుకంటే, సిబ్బంది కొరత ఉంటుంది. చేయాల్సిన డ్యూటీయేమో చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకనే గతంలో ఎంతమంది ప్రయత్నించినా వీక్లీఆఫ్ సౌకర్యం అమల్లోకి రాలేదు. కానీ జగన్ మాత్రం ఏదో మొక్కుబడిగా కాకుండా వీక్లీఆఫ ఇచ్చి తీరాల్సిందే అంటూ స్పష్టమైన ఆదేశాలిచ్చారు.

 

సిఎం ఆదేశాల్లోని చిత్తశుద్దిని గమినించిన ఉన్నతాధికారులు కూడా అందుకు అనుగుణంగానే కసరత్తు చేశారు. ముందుగా ఈ శనివారం నుండి విశాఖపట్నం జిల్లాలో ప్రయోగాత్మకంగా మొదలుపెట్టారు. ముందుగా నగరంలోని 2147 సివిల్, 850 ఆర్ముడ్ రిజర్వుడు కానిస్టేబుళ్ళకు అమల్లోకి తెచ్చారు. దశలవారీగా రాష్ర్టం మొత్తం ఈ సౌకర్యం అందుబాటులోకి తెస్తారు.

 

నిజానికి 8 గంటల పనివిధానం పోలీసు శాఖలో పనిచేయదు. పేరుకు 8 గంటలే కానీ నిజానికి వాళ్ళు 16 గంటలు పనిచేస్తారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో ఎవరికైనా వీక్లీఆఫ్ ఇవ్వాలంటే ముందు పోలీసు శాఖలో అందులోను ప్రధానంగా ట్రాఫిక్ సిబ్బందికి ఇవ్వాలి.  మొత్తం మీద దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న డిమాండ్ అమల్లోకి రావటంతో పోలీసులంతా పిచ్చ హ్యాపీగా ఉన్నారు. మొత్తానికి ఇచ్చిన హామీలను అమలు చేయటంలో జగన్ గ్రేట్ అనిపించుకున్నారు.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: