హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అంతంత మాత్రమే ఉన్న కాంగ్రెస్ పార్టీకి మరో గట్టి దెబ్బ తగిలే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఇప్పటికే 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి హ్యాండ్ ఇచ్చిన నేపథ్యంలో మరికొందరు అదే దారిలో పయనిస్తున్నారంటూ వున్నత వర్గాల గుసగుసలు. తెలంగాణ రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల్లో నాలుగు సీట్లు సాధించి మంచి ఉత్సాహంగా ఉన్న బీజేపీ గట్టి పట్టుకోసం పావులు కదుపుతోంది. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపింది బీజేపీ.

 

ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో పర్యటించిన రామ్ మాధవ్ ను కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతలు, తటస్థంగా ఉన్న నేతలు, టీడీపీ నేతలు కలిశారు. బీజేపీలో చేరేందుకు పలువురు ఉత్సాహం చూపిస్తున్నారు. ఇటీవల లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించిన ఎంపీలు, ఎమ్మెల్యే ఒకరు బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. అనంతరం తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతలు కోమటిరెడ్డి బ్రదర్స్ రామ్ మాధవ్ తో చర్చలు జరిపినట్లు వినికిడి.

 

ఐతే, కోమటిరెడ్డి బ్రదర్స్ బీజేపీ అగ్రనేత రామ్ మాధవ్ పై వస్తున్న వార్తలను, ఎంపీ వెంకటరెడ్డి ఖండించారు. తాము కాంగ్రెస్ పార్టీలోనే ఉంటామని ఎట్టిపరిస్థితుల్లో బీజేపీలో చేరబోమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంతోపాటు అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తానని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కోమటిరెడ్డి బ్రదర్స్ కాంగ్రెస్ పార్టీకి ఎంతో అండదండగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితులలో వారు పార్టీని వదిలి వెళ్ళిపోతే మాత్రం కాంగ్రెస్ నిజంగానే కోలుకోలేని పరిస్థితికి చేరే అవకాశం లేకపోలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: