ముఖ్యమంత్రి యువనేస్తం నిరుద్యోగ భృతి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా సుమారు 5 లక్షల మంది లబ్ధి పొందారు. గత సంవత్సరం అక్టోబర్లో ప్రవేశపెట్టిన ఈ పథకం 2019 మే దాకా కొనసాగింది. సీ ఎంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాన్ని కొనసాగిస్తారని అందరూ అంచనా వేసారు 
 
కానీ అంచనాలకు విరుద్ధంగా ఈ పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగించట్లేదు. గ్రామ వాలంటీర్ల నియామకం, గ్రామ సచివాలయంలో ఉద్యోగాలు ఇవ్వనుండటంతో ఈ పథకాన్ని రద్దు చేసినట్లు తెలుస్తుంది. కానీ నిరుద్యోగులు మాత్రం ఈ పథకాన్ని కొనసాగించి ఉంటే బాగుండేదనే అభిప్రాయపడుతున్నారు. 
 
యువనేస్తం ద్వారా సిటీల్లో పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న నిరుద్యోగులకు ఈ పథకం చాలా ఉపయోగపడింది. ప్రభుత్వ పరీక్షలకు ఫీజులు చెల్లించటానికి, పరీక్ష సెంటర్లకు చేరుకోవడానికి ఈ పథకం చాలా ఉపయోగపడింది. జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ఈ పథకం గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని నిరుద్యోగులు అభిప్రాయపడుతున్నారు. మరి సీ ఎం జగన్మోహన్ రెడ్డిగారు ఈ విషయం గురించి ఆలోచిస్తారో లేదో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: