ఆ ఇద్దరి కోసం అద్భుతమైన జైలు!! ముంబయిలోని లోయర్‌ పారెల్‌ పరిథిలోని జేఆర్‌ బొరీచా మార్గంలో ఒక అరుదైన సకల సౌకర్యాల కారాగారం ఉంది.దాని పేరు,ఆర్థర్‌ రోడ్‌ జైలు. ఇంతకీ ఆ జైలు ముచ్చట ఇపుడు ఎందుకంటే, మాజీ లిక్కర్‌ కింగ్‌ విజయ్‌ మాల్యా, వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీలకు కను శిక్ష పడితే వారు ఉండబోయేది ఆ జైల్లోనే...
 బుధవారం నీరవ్‌ మోదీకి సంబంధించిన బెయిల్‌ పిటిషన్‌ను యూకే కోర్టు కొట్టివేసింది.

దీంతో ముంబయి పోలీసులు జైలు గదిని సిద్ధం చేస్తున్నారు. ఇక విజయ్‌ మాల్యా కేసు కూడా జులైలో విచారణకు రానుంది. ఇతడికి కూడా శిక్ష పడే అవకాశం ఉండటంతో ఇద్దరినీ ఒకే సెల్‌లో ఉంచుతారని అనధికార సమాచారం.
ఈ జైల్‌ లో విశేషాలేంటీ...? పొడవైన ఫ్రెంచ్‌ కిటికీలు..టాయిలెట్లు, 24 గంటలు నీటి సదుపాయం.. తాజాగా తెల్లటి పెయింట్‌ వేసి నిగనిగలాడుతున్న గోడలు.. ఫ్యాన్లు, లైట్లు.. మెత్తటి పరుపులున్న విలాసవంతమైన మంచాలు..సీసీ కెమెరాలు.. ఇలా సకల ఏర్పాట్లు ఉంటాయి. సెల్‌లో సీసీ కెమెరాలు కూడా అమర్చారు.

కేవలం వీరి కదలికలు గుర్తిండచానికే కాకుండా కోర్టు ఎప్పుడైనా వీరితో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడదలిస్తే అందుకు ఉపయోగంగా ఉంటాయని వీటిని అమర్చారు. బ్యాంకులకు రూ. వేల కోట్లు ఎగనామం పెట్టి విదేశాల్లో విహరిస్తున్న ఆర్థిక నేరస్థులు ఉండబోయే జైలు గదులు ఇవి. 
pisd of Arthur Road Jail,



మరింత సమాచారం తెలుసుకోండి: