వైసీపీలో ఎవరు మాట్లాడిన మాట్లాడకపోయిన విజయసాయిరెడ్డి మాట్లాడినా, విమర్శలు చేసిన ట్విట్టర్ లో క్షణాల్లో వైరల్ అయిపోతుంది. పదునైన మాటల దాడితో టీడీపీని ఉక్కిరి బిక్కిరి చెయగలడు. అయితే టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై సోషల్‌మీడియా వేదికగా మరోసారి విరుచుకుపడ్డారు వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి. చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం జరిగిన టీడీపీ పార్లమెంటరీ సమావేశంలో ఎన్డీయే, యూపీయే కూటములకు సమానదూరం పాటించాలని నిర్ణయించారు. 


దీనిపై వ్యంగ్యంగా స్పందించిన విజయసాయిరెడ్డి.. ‘ఎన్నికల షాక్‌ నుంచి తేరుకోకముందే చంద్రబాబు మరో యూటర్న్. ఇకపై కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏలో కొనసాగరట. కేంద్రంపై పోరాటాలకు విరామం ఇస్తారట. అర్థమవుతోంది గదా...మోదీ, అమిత్‌షాకు మోకరిల్లే ప్రయత్నం అని. ముగ్గురు ఎంపీలతో ఆయన ఎన్ని యూటర్నులు తీసుకున్నా పట్టించుకునే వారుండరు’. 


‘ప్రజా సమస్యలపై పోరాడాల్సిన ప్రతిపక్ష పార్టీ తమ నాయకుడి సౌకర్యాలు, ఇబ్బందుల గురించి ఆందోళనకు దిగడం సిగ్గుచేటు. విమానాశ్రయ భద్రతా నిబంధనలు ఎవరైనా పాటించాల్సిందే. ప్రజలు ఛీకొట్టిన తర్వాత కూడా ఇంకా తానే సీఎం అన్నట్లుగా ఆయన (చంద్రబాబు) భ్రమపడటం, మీరు భజన చేయడం ఎబ్బెట్టుగా లేదూ?’ అంటూ విరుచుకుపడ్డారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: