2019 ఎన్నికల్లో వైసీపీ తరపున జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా గెలిచారు. తిరుగులేని మెజారిటీ సొంతం చేసుకున్నారు. ఈ విజయంలో ప్రశాంత్ కిషోర్ పాత్ర కూడా కొంతవరకు ఉంది. కానీ ప్రశాంత్ కిషోర్ మాత్రమే జగన్ గెలుపుకు కారణం కాదు.ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు కేవలం వ్యూహకర్తలు మాత్రమే. వారు గెలుపుకోసం సలహాలు ఇవ్వగలరు తప్ప గెలిపించే స్థాయి ఐతే కాదు. 
 
చంద్రబాబు నాయుడు ప్రశాంత్ కిషోర్ ను వ్యూహకర్తగా నియమించుకున్నట్లు ప్రచారం జరుగుతుంది కానీ ఆ ప్రచారంలో ఎంత మాత్రం నిజం లేదు. ప్రశాంత్ కిషోర్ కు జగన్ కు ఇంకా బంధం తీరిపోలేదు. ఆ బంధం ఇంకా కొనసాగుతూనే ఉందని తెలుస్తుంది. ప్రజల్లో బలమైన వ్యతిరేకత ఉన్నప్పుడు ఎంతమంది వ్యూహకర్తలను నియమించుకున్నా ఫలితం శూన్యం. వృధాగా వ్యూహకర్తలకు డబ్బు ఖర్చు పెట్టడం తప్ప ఇంకేమీ ఉండదు. 
 
ప్రశాంత్ కిషోర్ కూడా వైసీపీ పార్టీ విజయం కోసం పని చేసి తెలుగుదేశం వైపు వెళ్ళే వ్యక్తి మాత్రం కాదు . ఇలాంటి పుకార్లను పుట్టించటం వలన ఎవరికీ ఎలాంటి ఉపయోగం ఉండదు. 2024 ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. ఎన్నికలకు రెండేళ్ళ ముందు వరకు ఇలాంటి వ్యూహకర్తల గురించి కూడా నాయకులు ఎవరూ ఆలోచించరు. 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: