పేదల ఇళ్ల కోసం కోట్లు విలువ చేసే అరుదైన భూమిని ప్రభుత్వానికి విరాళంగా ఇవ్వడానికి ఓ ఎన్నారై మహిళ ముందుకొచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలంలోని గర్వు గ్రామానికి చెందిన ప్రవాసీ మహిళ పడాల కస్తూరి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాల్లో భాగంగా పేదవారి సొంతింటి కలను నెరవేర్చేందుకు పడాల కస్తూరి తన దగ్గరున్న 1.10 ఎకరాల భూమిని విరాళంగా అందజేస్తున్నారు.

 

మార్కెట్‌ రేటు ప్రకారం దీని విలువ, అంటే సుమారుగా రూ.4 కోట్ల రూపాయిలు ఉంటుంది. రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు గారి ప్రోద్బలంతో ఈ భూమిని అందించాలని ఆమె నిర్ణయించారు. లండన్‌ నుంచి వచ్చిన కస్తూరిని మంత్రి అభినందించారు. కాగా, శనివారం ఆచంటలోని మంత్రి శ్రీరంనాథరాజును పలు పార్టీల నేతలు కలిసి వినతిప్రతాలను అందజేశారు.

 

మంత్రి మాట్లాడుతూ, నియోజకవర్గ అభివృద్ధికి పార్టీలకు అతీతంగా సహకరించాలని కోరారు. అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేస్తామని, ఇందు కోసం భూమిని ఇచ్చేందుకు రైతులు ముందుకు రావాలని ఆయన విజ్ఙ‌ప్తి చేశారు. అర్హులైనవారికి ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని, గృహానిర్మాణంలో అవకతవకలు జరక్కుండా చూస్తామని అన్నారు. ఆచంటను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చుదిద్దుతామని మంత్రి హామీ ఇచ్చారు.

 

సి.యం జగన్ ఆమెకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు.  నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు, మరియు ప్రజలు కూడా ఎవరి తోచినంతలో వారు ఎదుటివారికి సహాయం చేయాలని విన్నవించుకున్నారు.  రాబోయే ఐదేళ్ళలో మన ఏ.పి లో పేదరికం అనేదే లేకుండా చేయడానికి తమ వంతు కృషి చేస్తానని వై.ఎస్.అర్.సి.పి పార్టీ తరుపున వ్యాఖ్యానించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: