ఏపీని ముఖ్యంగా రాజ‌ధాని జిల్లా గుంటూరును రాజ‌కీయంగా కుదిపేస్తున్న విష‌యం కే-ట్యాక్స్‌. గ‌త ప్ర‌భుత్వంలో స్పీక ర్‌గా వ్య‌వ‌హ‌రించిన సీనియ‌ర్ టీడీపీ నేత‌, రాజ‌కీయ దిగ్గజం.. కోడెల శివ‌ప్ర‌సాద‌రావు కుమారుడు, కూతురు, తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని సాగించిన దందాలు, వ‌సూళ్ల ప‌ర్వంపై అప్ప‌ట్లో ప్ర‌భుత్వానికి, చంద్ర‌బాబుకు భ‌య‌ప‌డి.. పెద్ద‌గా విమ‌ర్శ‌లు రాక‌పోయినా.. ఇప్పుడు ప్ర‌భుత్వం మార‌డం, అవినీతిని స‌హించేదిలేద‌ని, ఎలాంటివారైనా, ఎంత‌టివారినైనా ఉపేక్షించేది లేద‌ని సీఎం జ‌గ‌న్ ప్ర‌క‌టించ‌డంతో కే-ట్యాక్స్ భాదితులు ఒక్కొరొక్క‌రుగా వెలుగులోకి వ‌స్తున్నారు. త‌మ‌కు జ‌రిగిన అన్యాయాల‌పై పోలీసుల‌కు వివ‌రిస్తూ.. కేసులు పెడుతున్నారు. 


బాధితుల్లో ఎక్కువ‌గా మ‌హిళ‌లు కూడా ఉండ‌డంతో ఈ విష‌యం రాష్ట్రంలో సంచ‌ల‌నం సృష్టిస్తోంది. గ‌తంలో రైల్వే కాంట్రాక్ట‌ర్ల‌ను కూడా బెదిరించిన ఉదంతాలు, వారి నుంచి కూడా క‌మీష‌న్లు తీసుకున్న బాగోతాలు ఇప్పుడు తెర‌మీదికి వ‌స్తుండ‌డంతో నేరుగా ఈ కేసులపై కేంద్ర ప్ర‌భుత్వం కూడా దృష్టి సారించిన‌ట్టు స‌మాచారం. ఈ నేప‌థ్యంలో అస‌లు ఈ కే-ట్యాక్స్ విష‌యంపై నేరుగా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ కూడా దృష్టి పెట్టిన‌ట్టు తెలిసింది. రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌ది ఈ జిల్లానే కావ‌డంతో మ‌రింత ఊపుతో దీనిని ప‌రిష్క‌రించేందుకు కేంద్రంలోని బీజేపీ కూడా నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలిసింది. 


ఆంధ్రప్రదేశ్ మాజి స్పీకర్ కోడెల శివప్రసాద్ కుటుంబ సభ్యుల పై వస్తున్న ఫిర్యాదులు, కేసుల పై ప్రధానమంత్రి కార్యాలయం ఆరా తీయడం పై అధికార వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. రాజ్యాంగబద్దమైన స్పీకర్ పదవిలో వుండి ఇటువంటి దారుణాలకు పాల్పడిన వారిని రాజకీయాల్లో , రాజకీయ పార్టిలో ఎలా కొనసాగిస్తున్నారు అని ప్రదాని మోడీ ఢిల్లి లో చేసిన‌ వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి.  అనేక ప్రభుత్వ శాఖల్లో వీరు చేసిన కుంభకోణాలు అన్ని ఇన్ని కావు అని మోడీకి తెలిసింది.  గతంలో రైల్వే కాంట్రాక్టర్ ఫిర్యాదు ను గుర్తుచేసిన  మోడీ, వీటన్నిటి  పై అవసరమైతే సీబీఐ విచారణకు ఆదేశించేందుకు కూడా రెడీ కావ‌డం మ‌రింతగా కోడెల ఫ్యామిలీని బోనులోకి ఎక్కించేందుకు రెడీ అయిన‌ట్టు తెలుసూ్తోంది.  ఈ నేప‌థ్యంలో ఇది ఎలాంటి మ‌లుపు తీసుకుంటుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: