ఏ  పార్టీ అధికారంలో ఉంటె ఆ పార్టీలోకి జంప్ కావడానికి సిద్ధంగా ఉండే నేతల్లో గంటా శ్రీనివాసరావు ఒకరు.  ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి ఇక్కడి నుంచి అక్కడికి జంప్ అవుతుంటాడు.  ఏ పార్టీలో ఉన్నా.. ఎక్కడి నుంచి పోటీ చేసినా గెలిచే నేతగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 


రాజీనామా చేసి వైకాపాలోకి వెళ్లినా పెద్దగా నష్టం లేదు.  ఈజీగా గెలిచేస్తాడు. అందుకే పచ్చ పార్టీ నుంచి జంప్  కావడానికి   సిద్ధంగా ఉన్నాడు.  ఈయన స్నేహితుడు వైకాపా లో ఉండి రాయభారం నడుపుతున్నాడు.  ఈ రాయభారంతో  గంటా  అడుగు వేస్తున్నాడు.  


టిడిపిలో పార్టీ మారే ఆలోచన వ్యక్తులను ఒకచోటకు  తీసుకొచ్చి వాళ్లతో బేరసారాలు చేస్తూ.. వైకాపాలోకి వెళ్లాలని చూస్తున్నారు.  ఒక్కడుగా వెళ్లడం కంటే ఇద్దరు ముగ్గురు కలిసి వెళ్తే వెయిట్ ఉంటుంది కాబట్టి గంటాతో పాటు వైకాపాలోకి వెళ్ళాలి అనుకున్న వ్యక్తులను తనతో తీసుకెళ్లేందుకు సిద్దము అవుతున్నాడు.  


గంటా రాయభారం వర్కౌట్ అయినట్టే కనిపిస్తోంది.   వరసగా దాదాపు 8 టీడీపీ  నేతలు వైకాపాలో చేరేందుకు సిద్ధం అవుతున్నారు.  వెళ్ళాలి అంటే స్పీకర్ ఫార్మాట్ లోనే వెళ్ళాలి.  అంటే రాజీనామా చేసి వెళ్ళాలి.  ఇప్పుడు వీళ్ళు రాజీనామా చేస్తే తిరిగి ఎమ్మెల్యేలుగా గెలుస్తారా లేదా.. 


మరింత సమాచారం తెలుసుకోండి: