ఇటీవల జరిగిన పార్టీ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ తన ఓటమి కారణాలు ఏమిటో తెలియట్లేదని గతంలో ఓడినపుడు కనీసం కారణాలైనా తెలిసేవని అన్నాడు. కానీ తెలుగుదేశం పార్టీ ఎందుకు ఓడిపోయిందో చెప్పాలంటే లెక్కలేనన్ని కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు అందరికంటే చంద్రబాబు నాయుడు గారికే బాగా తెలుసు. 
 
చంద్రబాబు గతంలో ఇచ్చిన హామీలు అమలు చేసిన తీరు బహుశా ఆయనకు గుర్తు లేదేమో కానీ ఆంధ్ర ప్రదేశ్ ప్రజనీకం మాత్రం బాగా గుర్తుంచుకున్నారు. రుణమాఫీ హామీని ఐదు విడతలుగా ఇస్తానని మూడు విడతల తో సరిపెట్టారు చంద్రబాబు. మిగతా రెండు విడతల రుణమాఫీ రైతుల అకౌంట్లలోకి చేరకుండానే చంద్రబాబు నాయుడు గారి పదవీకాలం ముగిసింది. 
 
చంద్రబాబు ఇప్పుడు మాత్రం తాను చాలా సంక్షేమ పథకాలను అమలు చేసామని ఐనా ఎందుకో ఓడిపోయానో అర్థం కావట్లేదని అంటున్నాడు. మరి నిజంగా అన్ని సంక్షేమ పథకాలు సరిగ్గా అమలు చేసి ఉంటే ప్రజలు ఎందుకు ఓడిస్తారో చంద్రబాబుకే తెలియలి .జన్మభూమి కమిటీలు చేసిన అరాచకాలు, రుణమాఫీ అమలు చేసిన తీరు, నిరుద్యోగ భృతి లాంటి హామీ ఎప్పటినుండి అమలు చేసాడో చంద్రబాబు నాయుడు గారు గుర్తు చేసుకుంటే తన ఓటమికి కారణాలు తనకే తెలుస్తాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: