నాలెడ్జి ఈజ్ డివైన్.. అంటే ఎంత తాగితే అంత కిక్ ఇస్తుంది.. అని అర్ధం అని బ్రహ్మాంనందం అతడు సినిమాలో చెప్తాడు.  జ్ఞానం ఎక్కువైనా కష్టమే.  అలాగే అధికారంలో ఎక్కువకాలం ఉన్న కష్టమే.  


బాబు విషయంలో అదే కదా జరుగుతున్నది.  బాబు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు.  కొన్ని సందర్భాల్లో మాజీ ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు.  అప్పట్లో లేని విధంగా బాబుకు ఇప్పుడు అవమానాలు జరుగుతున్నాయని మండిపడుతున్నారు.  


బాబుకు సెక్యూరిటీ తగ్గించారని టిడిపి నేతలు వాపోతున్నారు.  బాబుకు తగ్గించారు అని బాధపడేలోపే.. రాత్రికి రాత్రే.. జగన్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు.  మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులకు ప్రభుత్వం అందించిన గన్ మెన్ లో తీసేసింది.  హిట్ లిస్ట్ లో, త్రెట్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్న  వాళ్లకు ఒకరిద్దరు గన్ మెన్లను ఉంచింది.  


దీంతో తెలుగుదేశం పార్టీ నేతలు లబోదిబో అంటున్నారు.  సడెన్ గా సెక్యూరిటీని తొలగించడం  ఏంటని అంటున్నారు.  మాజీలకు అవసరం లేదని, ఒకవేళ త్రెట్ ఉంది ప్రొటెక్షన్ కావాలని ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంటే ప్రొటెక్షన్ ఇస్తామని అంటున్నారు.  కొంతమంది తమకు అవసరం లేదని ముందుగానే చెప్తే.. కొంతమంది  కావాలని దరఖాస్తు చేసుకున్నా వాటిని పక్కన పెట్టేస్తున్నారని మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు వాపోతున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: