ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపూర్ జిల్లా వజ్రకరూర్, కర్నూల్ జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి గ్రామాల్లో ప్రతి సంవత్సరం వర్షాకాలంలో వజ్రాలు దొరుకుతున్నాయి. వర్షాల ప్రభావానికి సారవంతమైన నేలల్లోని వజ్రాలు వర్షాకాలంలో పైకి వస్తాయి. అలా తుగ్గలి మండలం జొన్నగిరి గ్రామంలో ఒక గొర్రెల కాపరిని అదృష్టం వరించింది. 
 
ఒక గొర్రెల కాపరికి 8 క్యారెట్ల వజ్రం దొరికింది. దాని విలువ సుమారు 50 లక్షల రుపాయలు. ఆ గొర్రెల కాపరి ఆ వజ్రాన్ని 20 లక్షల రుపాయలకు ఒక వ్యాపారికి అమ్మాడు. ఇలా దొరకటం ఈ గ్రామాల్లో ఇదే మొదటిసారి కాదు. వజ్రకరూర్, జొన్నగిరిలలో ప్రతి సంవత్సరం ఇలాగే వజ్రాలు దొరుకుతాయి. ఎవరికైతే ఇలా వజ్రం దొరుకుతుందో వారు లక్షాధికారి అయినట్లే. 
 
కొందరు వ్యాపారులు ప్రత్యేకంగా కూలీలను నియమించుకుని మరీ వజ్రాల కోసం వెతికిస్తారు. మరి కొందరు వర్షాలు పడిన వెంటనే వజ్రాల కోసం వేట మొదలుపెడతారు. ఒక్క వజ్రం దొరికితే చాలు కొన్ని లక్షల రుపాయలు సంపాదించుకోవచ్చు. కొంతమంది ఇక్కడికి కార్లలో వచ్చి మరీ వజ్రాల కోసం వెతకటం విశేషం. ఏదేమైనా ఒక్క వజ్రం దొరికిందంటే బ్రతుకే మారిపోతుంది కదా. 



మరింత సమాచారం తెలుసుకోండి: