పార్లమెంట్‌ భవనంలో ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీల అధ్యక్షులతో ఈనెల 19న కేంద్రం ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది. ఇందులో భాగంగా వైకాపా అధినేత, ఏపీ సీఎం జగన్‌, తెరాస అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌, తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖమంత్రి ప్రహ్లాద్‌ జోషి 

5 అంశాలతో కూడిన ఒక లేఖరాశారు. ఈ లక్ష్యాల సాధనకోసం అన్ని పార్టీల అధ్యక్షులతో నిర్వహించే ఈ సమావేశానికి ప్రధాన మంత్రి నరేంద్రమోదీ కూడా హాజరుకానున్నారని వున్నత వర్గాల సమాచారం.

 

అజెండాలోని ముఖ్యాంశాలు...

  1. పార్లమెంట్‌ ఔన్నత్యాన్ని పెంపొందించేందుకు చర్యలు
  2. ఒక దేశం ఒకే ఎన్నికలు
  3. 75 ఏళ్ల స్వాతంత్ర్యం సందర్భంగా నవభారత నిర్మాణం
  4. మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకల నిర్వహణ
  5. వెనుకబడిన జిల్లాల అభివృద్ధి

 

ఈ ఐదు అంశాలపై చర్చించేందుకు పార్లమెంటులో ప్రాతినిథ్యం వహిస్తున్న పార్టీల అధినేతలు హాజరుకావాలని ప్రహ్లాద్‌ జోషి లేఖలో పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: