టీడీపీ ఘోర పరాజయం తరువాత నాయుకుడిగా చంద్రబాబు తరువాత టీడీపీలో నాయకుడు ఎవరినీ ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. అయితే టీడీపీ ఘోర పరాభవం తర్వాత కాస్త సైలెంట్ అయిన జేసీ ఇప్పుడు మరోసారి తన మనసులో అభిప్రాయాల్ని బయటపెట్టారు. మరీ ముఖ్యంగా టీడీపీలోకి జూనియర్ ఎన్టీఆర్ రావాలనే డిమాండ్ పై సూటిగా స్పందించారు. సినిమావాళ్లకు ప్రజల్లో పాపులారిటీ ఉంది. వాళ్లు వస్తే ఏం చేస్తాడో చూడాలనే ఆసక్తి ఉంటుంది.


ఎన్టీఆర్ నుంచి చిరంజీవి, పవన్ కల్యాణ్, రోజా వరకు చాలామంది వచ్చారు. వాళ్ల కోసం జనాలు వచ్చారు. కానీ అదంతా నిజమైన పాపులారిటీ అనుకుంటే తప్పు. ఎన్టీఆర్ ఎప్పుడైనా రాజకీయాల్లొకి రావొచ్చు. కొన్నేళ్ల తర్వాత ప్రజానాయకుడిగా కూడా మారొచ్చు. కానీ ప్రస్తుతానికైతే అతడు నటుడు మాత్రమే. చూడ్డానికి సీనియర్ ఎన్టీఆర్ లా ఉంటాడు కాబట్టి జనాలు బాగా వస్తారు. తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు కంటే మరో లీడర్ లేడు.


ఎన్టీఆర్ రాకవల్ల తెలుగుదేశం పార్టీలో పెద్దగా మార్పులు రావని పరోక్షంగా వెల్లడించారు జేసీ. ఇక పవన్ విషయానికొస్తే, అతడ్ని రాజకీయాల్లోకి రావొద్దని చెప్పానని, కానీ తన మాట వినలేదని అన్నారు జేసీ. పవన్ కు సినిమాల్లో ఎంత పెద్ద పేరుందో అందరికీ తెలుసు. ఆయన నా దగ్గరకు దూతను పంపించాడు. అతడ్ని చూడ్డానికి ప్రజలొస్తారు తప్ప, ఆయన మాటలు నమ్మరని అప్పుడే పవన్ కు సలహా ఇచ్చాను. రాజకీయాలు చాలా ఖరీదైపోయాయి. పవన్ సినిమాల్లో చాలా కష్టపడి ఓ 500 కోట్లు సంపాదించి ఉండొచ్చు. కానీ అది ఏమాత్రం సరిపోదని అప్పుడే చెప్పాను. పవన్ నా మాట వినలేదు. పసుపు-కుంకుమ కింద 10వేల రూపాయలిచ్చినా చంద్రబాబును జనం నమ్మలేదని అంగీకరించారు జేసీ.

మరింత సమాచారం తెలుసుకోండి: