చంద్రబాబుకు ఏపీ షాక్ నుంచి ఇంకా కోలుకున్నట్లు లేదు. అయితే ఈ ఓటమి బాబు గారి ఇమేజ్ చాలా వరకు డ్యామేజ్ అయ్యింది. ఏపీలో రెండోసారి అధికారం చేజిక్కితే.. కొడుకుని సీఎంని చేసి, తాను ఢిల్లీలో పెత్తనం చెలాయించాలని చూశారు. అందుకే బద్ధశత్రువైన కాంగ్రెస్ తో కూడా జతకట్టారు. ఏపీలో ఎన్నికలైపోయిన తర్వాత కూడా రాష్ట్రాల చుట్టూ తిరిగి అందర్నీ కెలికేసి వచ్చారు. తీరా ఫలితాలు తేడా కొట్టాయి.


తమిళనాడు మినహా.. మిగతా రాష్ట్రాల్లో బాబు స్నేహితులంతా దారుణ పరాభవాన్ని మూటగట్టుకున్నారు. ఏపీలో జగన్ కి తిరుగులేని ఆధిపత్యం రావడంతో అందరూ జగన్ వైపు ఆకర్షితులయ్యారు. డీఎంకే అధినేత స్టాలిన్, కేసీఆర్ తో కలసి జగన్ ప్రమాణ స్వీకారానికి తరలివచ్చారు. కర్నాటకలో బాబు మిత్రులైన దేవగౌడ కుటుంబ సభ్యులు ఒక్కొక్కరే జగన్ ను కలుస్తున్నారు.


దీంతో చంద్రబాబు ఇగో బాగా హర్ట్ అయింది. తన పరపతి పోవడంతో పాటు.. జగన్ ఇమేజ్ పెరిగిపోవడంతో బాబు అవమాన భారంతో రగిలిపోతున్నారు. ఫైనల్ గా జగన్ ఢిల్లీ పర్యటనతో బాబుకి కడుపుమంట మరీ ఎక్కువైంది. ఢిల్లీలో జగన్ ప్రత్యేకహోదా వ్యవహారాన్ని ఎంత జాగ్రత్తగా డీల్ చేస్తున్నారనే విషయం ఏపీ ప్రజలకు ఈపాటికే అర్థమైంది. ఎలాంటి ప్రలోభాలకి లొంగకుండా సీఎం జగన్ సమర గళాన్ని వినిపిస్తున్నారు. అటు నీతిఆయోగ్ సమావేశంలో సీఎం స్పీచ్ అందర్నీ ఆలోచనలో పడేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: