ఆంధ్రప్రదేశ్‌లో అధికారం మారడంతో రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వ వైఖరిలో క్రమంగా మార్పు వస్తున‌ట్టే కనిపిస్తున్నాయి. నవ్యాంధ్ర‌ సీఎంగా ఉన్న చంద్రబాబు ముందు ఎన్డీయేతో చెలిమి చేసి ఆ తర్వాత బయటకు వచ్చి తీవ్రమైన త‌గాదాలు పెట్టుకున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా తన చివరి రెండు సంవత్సరాల పాలన కాలంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కంటే ప్రతి రోజు కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై విమర్శలు చేసేందుకు టైం సరిపెట్టేశారు. ఈ క్రమంలోనే చంద్రబాబు ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రాకూడదని డిసైడ్ అయిన‌ బిజెపి ఎన్నికల్లో బాబును ఓడించేందుకు సర్వశక్తులు ఒడ్డింది. చివరకు ఏపీలో  వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. 


జగన్ సీఎం అయిన వెంటనే కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతతో మెలుగుతున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి వివిధ ప్రాజెక్టులు, ఫలితాలకు కావలసిన నిధులను శరవేగంగా విడుదల చేస్తోంది. గత రెండు వారాల్లోనే నరేంద్ర మోడీ సారధ్యంలోని ఎన్టీయే ప్రభుత్వం రాష్ట్రానికి సంబంధించి రూ. 4200 కోట్ల బిల్లులను క్లియర్ చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుపై ఇప్పటివరకు రూ. 11,655 కోట్లు ఖ‌ర్చు పెట్టింది. ఇందులో కేంద్రం రూ. 6,726 కోట్లు ఇవ్వ‌గా మిగిలిన డ‌బ్బుల కోసం చంద్ర‌బాబు చాలా సార్లు కేంద్ర ప్ర‌భుత్వానికి విజ్ఞ‌ప్తులు చేసినా కేంద్రం ఆయ‌న మాట‌లు ప‌ట్టించుకోలేదు. ఇందుకు చంద్ర‌బాబు కేంద్ర ప్ర‌భుత్వంతో అవ‌లంబించిన వ్య‌తిరేక వైఖ‌రే నిద‌ర్శ‌నం.


ఇప్పుడు ఏపీలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పాటు  జగన్‌ను బీజేపీ పెద్దలు ఏకంగా ఎన్డీయేలోకి ఆహ్వానించారు. కేంద్ర ప్రభుత్వంలో పలు కీలక పదవులు ఆఫర్ చేయడం ఇవన్నీ చూస్తుంటే జగన్ విషయంలో కేంద్రం పూర్తి సానుకూల ధోర‌ణితో ఉన్న‌ట్టు తెలుస్తోంది. భ‌విష్య‌త్తులో రాజ్య‌స‌భ‌లో వైసీపీ మ‌ద్ద‌తు ఎన్టీయే స‌ర్కార్‌కు అవ‌స‌రం కానుంది. ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని మ‌చ్చిక చేసుకునే క్ర‌మంలోనూ, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వంతో స‌న్నిహిత సంబంధాలు నెల‌కొల్పుకునే ఉద్దేశంతోనూ... కేంద్ర ప్ర‌భుత్వం జ‌గ‌న్ విష‌యంలో స‌న్నిహిత సంబంధాలు నేరుపుతోంది. జగన్ ఏపీ సీఎం అవ్వడంతో పరిస్థితుల్లో పూర్తి మార్పు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం మూడు వేల కోట్ల విడుదలకు ఆమోదం తెలిపింది. ఈ ఫైల్ ఆర్థిక శాఖ నుంచి నాబార్డ్‌కు వెళ్లనుంది.

ఇక యుటిలైజేష‌న్ స‌ర్టిఫికెట్స్‌ అందిన త‌ర్వాత మ‌రో రూ. 1929 కోట్ల‌కు కూడా త్వ‌ర‌లోనే ఆమోదం ల‌భించ‌నుంది. ఏదేమైనా రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించి కేంద్ర ప్ర‌భుత్వంతో ఘర్షణాత్మక వైఖ‌రి లేకుండా ఉంటే రాష్ట్రాన్ని ఎలా ? అభివృద్ధి చేసుకోవ‌చ్చో జ‌గన్మోహ‌న్ రెడ్డి చ‌క్క‌ని ఉదాహ‌ర‌ణ‌. మాటి మాటికి న‌ల‌బై ఏళ్ల అనుభ‌వం అని చెప్పుకునే మాజీ సీఎం చంద్ర‌బాబు కంటే జ‌గ‌న్ 15 రోజుల్లోనే ఎంతో ప‌రిణీతి చెందిన సీఎంగా జాతీయ స్థాయిలో త‌న ప్ర‌భావం చూపుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: