చదువుకునే యువత కెరీర్‌పై దృష్టి సారించకుండా చెడు వ్యసనాలకు త్వరగా అలవాటు పడుతున్నారు. కీలకమైన యవ్వనదశలో కెరీర్‌పై కాన్సెంట్రేషన్ చేస్తే వారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది.. అయితే యువత యవ్వన దశలోనే ఎక్కువగా చెడు వ్యసనాలకు ఆకర్షితులవుతారు. దానికి ఒక సారి అలవాటు పడితే తర్వాత దాని నుంచి బయటకు రావడం కష్టం అవుతుంది. టీనేజ్ దాటుతున్న క్రమంలో యువకులు ఎక్కువగా అనేక చెడు వ్యసనాలకు గురవుతున్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో పలువురు కాలేజ్ స్టూడెంట్స్ వ్యభిచారం చేసేందుకు బాగా అలవాటుపడ్డారు.


ఈ క్రమంలోనే వీరి బలహీనతలను ఆసరాగా చేసుకుని  నిర్వాహకులు బాగా సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా పోలీసులు జరిపిన దాడుల్లో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ తో పాటు బీ ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ చదువుతున్న విద్యార్థులు అడ్డంగా దొరికిపోయారు. జాతీయ రహదారి పక్కన నరసన్నపేట మండలం దామరపల్లి మామిడి తోటల్లో వ్యభిచారం జరుగుతున్నట్లు పోలీసులకు కొద్దిరోజులుగా సమాచారం అందుతోంది. 


దీనిపై తాజాగా పోలీసులు జరిపిన దాడుల్లో వ్యభిచారం చేస్తున్న 20 మందితో పాటు ముగ్గురు యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారిలో మూడు వంతులకు పైగా విద్యార్థులు ఉండటం విశేషం. ఇక ఇక్కడ వ్యభిచారం చేసేందుకు రాజమండ్రికి చెందిన యువతులను నిర్వాహకులు తీసుకువచ్చినట్టు విచారణలో తేలింది. ఆర్థిక బలహీనతలను ఆసరాగా చేసుకుని యువతులను ప్ర‌లోభ‌పెట్టి వారిని ఇక్కడకు తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: