వైఎస్ జగన్ ఏపీకి సీఎం. అంతకు ముందు ఆయన బిజినెస్ మ్యాన్. ఇక  దానికి ముందు పాదయాత్రికుడు, ప్రతిపక్ష నేత. ఇలా బహుముఖీయమైన రూపాల్లో జగన్ పదేళ్ల కాలంలో ఏపీ పై తనదైన ముద్ర వేశారు. నవ్వుతూనే ఉంటూ చేయాల్సింది చేయడం జగన్ స్పెషాలిటీ.


ఎంతో కష్టపడి అధికారంలోకి వచ్చిన జగన్ దాన్ని తనతో పాటు కష్టపడ్డవారికి పంచారు. పరిపాలన మీద ఇపుడు ఆయన ద్రుష్టి నిలిపారు. అయితే జిల్లాల్లో సీన్ వేరేగా  ఉంది. పదేళ్ళుగా దెబ్బలు తిన్న క్షేత్ర స్థాయి నాయకులు క్యాడర్ కొంతమంది  దాడులకు దిగుతున్నారు. టీడీపీతో ఘర్షణలు పడుతున్నారు. ఇది పార్టీకి చెడ్డ పేరు తెస్తోంది.


దీంతో జగన్ సీరియస్ అయ్యారట. పార్టీకి చెడ్డ పేరు తేస్తే వూరుకోనని గట్టిగా వార్నింగే ఇచ్చారట. మనం అధికారంలోకి వచ్చింది ప్రజలకు మేలు చేయడానికి, అంతే తప్ప దాడులకు కాదు, ఇకపై వాటిని స్టాప్ చేయించాలి. మంత్రులు, ఎమ్మెల్యేలదే ఈ బాధ్యత. ఎవరైనా ఉపేక్షిస్తే సీరియస్ యాక్షన్ ఉంటుంది. ఇకపై మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై మార్కులు వేస్తాను, గట్టిగానే ఉంటాను అంటూ మాస్టారు రూపంలో జగన్ తీసుకున్న క్లాస్ ఇపుడు పార్టీలో చర్చగా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: