న్యూఢిల్లీ : కాంగ్రెస్ తూర్పు ఉత్తర ప్రదేశ్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆ పార్టీకి పూర్వ వైభవం తేవడానికి నడుం కంకణం కట్టుకున్నారు. కాంగ్రెస్ వర్గాల సమాచారం ప్రకారం ఆమె ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికలపై దృష్టి సారించారు. తాజాగా జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో పార్టీని క్షేత్ర స్థాయి నుంచి బలోపేతం చేయడానికి ఆమె స్వయంగా రంగంలోకి దిగుతున్నారు.

 

వారానికి రెండుసార్లు ఉత్తర ప్రదేశ్‌లో పర్యటిస్తూ, క్షేత్ర స్థాయి కాంగ్రెస్ కార్యకర్తలతో మాట్లాడాలని ప్రియాంక గాంధీ నిర్ణయించారు. లోక్‌సభ ఎన్నికల అనంతరం నిర్వహించిన సమీక్షలో పార్టీ కార్యకర్తలు, నేతల మధ్య సమన్వయం పెరగాలని నిర్ణయించినట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. కార్యకర్తలతో నేరుగా మాట్లాడటం వల్ల ప్రయోజనం ఉంటుందని నిర్ణయించినట్లు పేర్కొన్నాయి.

 

ప్రియాంక గాంధీ కనీసం వారానికి రెండుసార్లు కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించాలని తీర్మానించినట్లు పేర్కొన్నాయి. గత బుధవారం సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ రాయ్‌బరేలీ నియోజకవర్గంలో పర్యటించారు. కాంగ్రెస్ కార్యకర్తలే పార్టీని కూల్చేశారని ప్రియాంక ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈసారి అటువంటివి జరగకుండా జాగ్రత్త పడినట్టు కనబడుతుంది.

 

వరుస పరాజయాల వలన దెబ్బతిన్న కాంగ్రెస్ దిగ్గజాలు ఈసారి విజయం చేజారిపోకుండా గట్టి చర్యలే చేపడుతున్నట్టు బోగట్టా.  రకరకాల వ్యూహాలతో, కార్యాలతో రాబోయే ఎన్నికల్లో మోడీ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే ధ్యేయంగా ఉన్నట్టు మనకు తెలుస్తోంది.  మదం సోనియా వారిరువురికి మార్గ దర్శకమని వేరేగా చెప్పనక్కర్లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: