ఆయ్‌... మా గోదావరి గలగలలు, సెలయేటి పరవల్లు, సాంస్క్రృతిక వరవల్లు రాష్ట్రంలో ఇంకెక్కడా కనిపించవండీ... కాకినాడ కాజా, ఆత్రేయపురం పూతరేకులు, రాజమండ్రి రోజ్‌మిల్క్‌, కోనసీమ కొబ్బరి అందాలు... కొండల్లో కోయిల కిలకిలా రావాలు, హోరున ఎగసిపడే సాగర కెరటాలు... మడ అడవులు, తడి ఆరని చిత్తడి నేలలు... అబ్బో ...ఇలా చెప్పుకుంటా పోతావుంటేనండీ... దీని సిగదెరగా...ఎంతకీ తరగదండీ మా గోదారి జిల్లా గొప్పతనం.  మంచితనానికి మారుపేరండీ... మా గోదావరి జిల్లాలు. అలాంటి గోదావరి జిల్లా పేరు ప్రపంచపటంలో లేకుండా చెత్తారండీ... అబ్బే... మేం ఎంతమాత్రం ఒప్పుకోమండీ... ఇదీ ఉభయగోదావరి జిల్లాల సీనియర్‌ సిటిజన్లు , సాంస్క్రృతిక వాదుల వాదన.


వై ఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోనికి వచ్చిన అనంతరం 13 జిల్లాల సముదాయంగా ఉన్న రాష్ట్రాన్ని 25 జిల్లాలుగా విభజన చేయనున్నట్టు వచ్చిన ప్రచారంపై ఉభయగోదావరి జిల్లాల వయోవృద్ధులు పలు సూచనలు చేస్తున్నారు. రాష్ట్రాన్ని ఎన్ని ముక్కలుగా చేసుకున్నా పర్వాలేదుగాని ఉభయ గోదావరి జిల్లాలకు ఆ పేరు పలికేట్టు జిల్లా పేరుండాలని కోరుతున్నారు.  ప్రధానంగా తూర్పుగోదావరి జిల్లా ను కాకినాడ, రాజమండ్రి, అమలాపురం జిల్లాలుగా విభజించనున్న నేపధ్యంలో గోదావరి చెంతనున్న రాజమండ్రికి గోదావరి జిల్లాగా పేరు పెట్టాలని కోరుతున్నారు.


ఓ సీనియర్‌ సిటిజన్‌ ఏకంగా వీడియో చేసి సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేశారు.  గోదావరి శబ్ధం గోదావరి జీవనది సూచికంగా ఉంటుందని అందుచేత గోదావరి జిల్లా ఉండేట్టు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి అలోచించాలని ఆ వీడియో ద్వారా ఆ సీనియర్‌ సిటిజన్‌ అభ్యర్ధించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: