▪ నవరత్నాలు పథకాల్లో భాగంగా ‘వైఎస్సార్‌ ఆసరా’ ద్వారా డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేసేందుకు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి గ్రీన్‌సిగ్నల్‌.

 

▪ ఏప్రిల్‌ 11వ తేదీకి ముందు రుణం తీసుకున్న డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం రుణమాఫీ చెయ్యాలని నిర్ణయం.

 

▪ ఈమేరకు రూ.840 కోట్ల మాఫీ చేయనున్నారు. ఈ రుణమాఫీని నాలుగు విడతలుగా చేపట్టనున్నారు.

 

▪ కానీ రుణం పొందిన మహిళలు తమ బాకీని మాత్రం కడుతూ ఉండాలి. తరువాత రోజుల్లో ప్రభుత్వం నుంచి మాఫీ అయినా నగదు మొత్తం లబ్ధిదారుల బ్యాంకు అకౌంట్‌లో జమవుతుంది.

 

▪ మండలాలు, పట్టణాల్లో సంబంధిత అధికారులు బ్యాంకు ల ద్వారా అర్హులైనా లబ్ధిదారులను ముందుగా గుర్తిస్తారు.

 

▪ అలా గుర్తించిన వారిని ఏపీఎం లాగిన్‌ ద్వారా సెర్ఫ్‌కు సమాచారం అందిస్తారు.

 

▪ అనంతరం 2019, ఏప్రిల్‌ 11 నాటికి అప్పుతీసుకున్న డ్వాక్రా సభ్యులకు ఆ మొత్తాన్ని బ్యాంకులో జమచేస్తారు.

 

▪నాలుగు విడతల్లో లబ్ధిదారులందరికీ రుణ మాఫీ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: