రాజకీయాల్లో ఇది అవును ఇది కాదు అని చెప్పలేం. అయితే కొన్ని క్యారక్టర్లు ఉంటాయి. అవి రాజకీయాలు అతీతం అన్నమాట. అటువంటి వారి విషయంలో పైన చెప్పుకున్నవన్ని తప్పు అవుతాయి. రాజకీయాళ్ళో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరు అంటారు కదా అంటే


దాని అర్ధం ఎప్పటికపుడు సిధ్ధాంతాలను మార్చుకోవడమే. కానీ బట్టలు మార్చేసినట్లుగా సిధ్ధాంతాలను మార్చేసే వారి విషయంలో ఇవి కూడా సరిపోవేమే. ఆ కేటగిరీలో ఇపుడు చంద్రబాబు ఉన్నారు. చంద్రబాబు ఇపుడు రాజకీయంగా పతనావస్థలో ఉన్నారు. ఓ విధంగా ఆయన పొలిటికల్ కెరీర్ కి ఎండ్ కార్డ్ పడిందనే చెప్పాలి.


కానీ శూన్యం నుంచి కూడా అన్నం పుట్టించగల దిట్ట చంద్రబాబు. అందువల్లనే ఆయన మరో యూ టర్న్ తీసుకున్నారట. కాంగ్రెస్ తో బంధం తెంచేసుకున్నారు. అంటే దాని అర్ధం బీజేపీకి దగ్గర జరగడమేనని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అంటున్నారు. మరి బాబుని బీజేపీ దగ్గరకు తీస్తుందా. మొన్నటి ఎన్నికల్లో మోడీకి వ్యతిరేకంగా కూటమి కట్టి నానా అల్లరి చేసింది బాబే కదా.


అయినా బీజేపీకి కూడా బాబు అవసరం ఉంది. అదేలా అంటే ఆయన్ని అలా రాజకీయంగా ఏపీలో  ఉనికిలో ఉంచడం. ఏపీలో జగన్ ఎదగకుండా చూడడం. ఇదో రకం విక్రుత క్రీడ. మరి దాని కోసం బీజేపీకి బాబు ఉపయోగపడతారా.  చూడాలి మరి. ఇలాంటి గేమ్స్  ఆడడంతో మోడీ, అమిత్ షాలు పండిపోయారని అంటారు మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: