ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు కళ్ళకు చక్రాలకు కట్టుకొని ఢిల్లీకి అమరావతికి తిరిగాడు.  తిరగడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులను కలిశారు.  యూపీఏ మిత్రపక్షాలన్నింటిని కలుపుకొని ఎలాగైనా మోడీని అడ్డుకోవాలని చూశారు.  ఇదే బాబుగారికి శాపంగా మారింది.  


నాలుగేళ్లు కలిసి ఉన్న బాబు సడెన్ గా ఎన్డీఏ నుంచి బయటకు రావడంతో పాటు వివిధ మోడీపై విమర్శలు సందించారు.  రాహుల్ తో కలిసి ప్రచారం చేశారు.  ఆంధ్రప్రదేశ్ లో పరిపాలనను పక్కన పెట్టి.. అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్, దాని మిత్రపక్షాల తరపున ప్రచారం చేశారు. 


చివరకు ఏమైంది... కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది.  అక్కడితో ఆగలేదు.  రాష్ట్రంలో టిడిపి ఘోరంగా దెబ్బతింది.  ఎన్నికల ముందువరకు కలిసి మెలిసి తిరిగిన బాబుగారు, కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టారు.  అనుకున్నది జరగలేదు.  చేసేదేముంది.. అందుకే కేంద్రంతో ఎందుకొచ్చిన గొడవలే అని చెప్పి.. సైలెంట్ గా ఉండనని అనుకుంటున్నారు. 


కొన్ని రోజులపాటు రెస్ట్ తీసుకోవాలని బాబు అనుకుంటున్నారట.  ఆ తరువాత తన కార్యాచరణను మొదలుపెడతారట.  కార్యాచరణ అంటే... మళ్ళీ ప్రజల్లోకి వెళ్లడం కాదు.. మోడీకి, అమిత్ షా కు దగ్గరయ్యేందుకు మార్గాలు అన్వేషించబోతున్నారట.  బాబు మోడీని కలిసి ఎన్డీఏ లోకి వస్తానంటే రానిస్తారా మోడీ.. 


మరింత సమాచారం తెలుసుకోండి: