కేసీయార్ కి డిసెంబర్ వరకూ హవా బ్రహ్మాండంగా వీచింది. బంపర్ మెజారిటీతో అధికారాన్ని రెండవమారు పట్టేశారు. ఎదురులేదని కూడా అంతా అనుకున్నారు. దాంతో మంత్రి వర్గ విస్తరణ నెల రోజుల పాటు చేయకుండా తన జోరు చూపించారు. ఆ తరువాత విస్తరణలో మేనల్లుడికి హ్యాండ్ ఇచ్చేశారు. ఇక తాజా లోక్ సభ ఎన్నికల్లో సగానికి సగం సీట్లు తగ్గాయి.


ఇపుడు ఏపీలో జగన్ అద్భుతమైన మెజారిటీతో అధికారం చేపట్టి వెలిగిపోతున్నాడు. మరో వైపు ఢిల్లీలో మోడీ బండ మెజారిటీతో రెండవమారు అధికారంలోకి వచ్చారు. కేసీయార్కి తెలంగాణాలో అన్ని రకాలుగా  సమస్యలు పెరుగుతున్నాయి. బీజేపీ గట్టి సవాల్ విసురుతోంది. టార్గెట్ 2023 గా పెట్టుకుంది. మరో వైపు పార్టీలో తీరు సవ్యంగా లేదు. కొడుక్కి పగ్గాలు అప్పగించడం ఇచ్చగించని వర్గాలు గులాబీదళంలో  ఉన్నాయని అంటున్నారు. 


ఈ పరిస్థితుల్లో కేంద్రంలో రెండవ మారు అధికారంలోకి వచ్చిన మోడీ ఫెడరల్ ఫ్రంట్ అంటూ ఫిడేల్ వాయించిన కేసీయార్ సంగతి చూడాలనుకుంటున్నారు. ఈ మధ్య డిల్లీలో కేసీయార్కి మోడీ అపాయింట్మెంట్ దొరకలేదు. అలిగిన కేసీయార్ నీతి ఆయోగ్ మీటింగుకు డుమ్మా కొట్టరు. ఏపీలో జగన్ని దువ్వుతూ కేసీయార్ మీదకు రావాలని బీజేపీ డిసైడ్ అయిపోయింది. ఈ పరిణామాలు ఇపుడు గులాబీబాస్ ని తెగ కలవరపెడుతున్నాయి. మోడీ గురి పెడితే ఏం జరుగుతుందో తెలిసిందే మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: