పార్లమెంట్ సమావేశాలు ఈరోజు నుంచి జరగబోతున్నాయి.  ఈ  సమావేశాల్లో మొదటి ఘట్టం ఉదయం ప్రొటెం స్పీకర్ ప్రమాణస్వీకారం.  ప్రొటెం స్పీకర్ గా ఎంపీ వీరేంద్ర కుమార్ ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి భవన్ లో ప్రమాణస్వీకారం చేస్తారు.  అనంతరం పార్లమెంట్ లో ఎంపీల ప్రమాణస్వీకారం ఉంటుంది.  


పార్లమెంట్ లో ఉదయం ప్రధాని మోడీ, ఇతర మంత్రులు, ప్యానల్ చైర్మన్లు మొదట ప్రమాణస్వీకారం చేస్తారు.  ఆ తరువాత ఎంపీల ప్రమాణస్వీకారం ఉంటుంది.  ఇంగ్లీష్ అక్షరాలా ప్రకారం ప్రమాణస్వీకారం ఉంటుంది.  మొదట అండమాన్ నుంచి ఎంపికైన ఎంపీలు ప్రమాణస్వీకారం చేస్తారు.  అనంతరం ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపికైన ఎంపీలు ప్రమాణస్వీకారం చేస్తారు. 

ఇదిలా ఉంటె, ఏపి నుంచి మొదటగా ప్రమాణస్వీకారం చేయబోయే ఎంపీ అరకు ఎంపీ గొడ్డేటి మాధవి.  పెద్ద నియోజక వర్గం అరకు కాబట్టి అక్కడి నుంచి మొదలు అవుతుంది.  ఎంపీల ప్రమాణస్వీకారం రెండు రోజులపాటు ఉంటుంది.  


ఎంపీల ప్రమాణస్వీకారం తరువాత ఉపరాష్ట్రపతి ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగం చేస్తారు.  ఈనెల 21 వ తేదీ నుంచి ప్రస్నోత్తరాల సమయం ఉంటుంది.  ఈనెలలోనే బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: