దేశంలో కాంగ్రెస్ పార్టీకి ఎంత గడ్డుకాలం నడుస్తోందో... అంతకంటే ఎక్కువ గడ్డుకాలం తెలంగాణాలో నడుస్తున్నది.  ఎలాగోలా కష్టపడి 19 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే.. అందులో 12 మందిని తెరాస లాగేసుకుంది.  కనీసం శాసనసభలో ప్రతిపక్షం లేకుండా చేసింది.  


12 మంది పోతేపోనీలే ఆరుగురు అయినా ఉన్నారు కాగా  అనుకుంటే, ఇందులో నలుగురు ఊగిసలాడుతున్నారు.  ఈ నలుగురు బీజేపీ వైపుకు చూస్తున్నారని వినికిడి.  నలుగురు ఎమ్మెల్యేలు బీజేపీ వైపుకు మారితే ఆ పార్టీ బలం ఐదుకు పెరుగుతుంది.  


తెరాస లో ఉన్న కొంతమంది చూపులు బీజేపీవైపు ఉన్నా.. కొన్ని కారణాల వలన గమ్మున ఉంటున్నారు.  కాంగ్రెస్ పార్టీ నుంచి నలుగురు బీజేపీలో జాయిన్ అయితే, తెరాస నుంచి మరికొంతమంది జంప్ అయ్యేందుకు రెడీగా ఉన్నారని సమాచారం.  


కాంగ్రెస్ పార్టీకి చెందిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి... జగ్గారెడ్డికి ఫోన్ చేసి మాట్లాడారు.  దేని గురించి ఆయన జగ్గారెడ్డితో మాట్లాడి ఉంటారు అన్నది సందేహం.  ప్రస్తుత రాజకీయాల గురించి మాట్లాడారా లేదంటే కాంగ్రెస్ పార్టీలో ఉంటె ఏముంటుంది.. బీజేపీలోకి వెళ్తే బాగుంటుంది అనే విషయాలపై మాట్లాడారా అన్నది తెలియాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: