మన దగ్గర రాజకీయాలు ఎలా ఉంటాయో చెప్పక్కర్లేదు. ఒకరు ఒక మంచి పని చేస్తుంటే దానిని పక్కన ఉన్న వ్యక్తులు చెడగొట్టాలని చూస్తుంటారు.  ఇది కామనే.  మంచి పనులు చేయాలి అనుకున్నప్పుడు కొన్ని జరుగుతూ ఉంటాయి... వాటిని పట్టించుకోకూడదు.  


తెలంగాణా సస్యశ్యామలం కోసం తెరాస ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ ను పూర్తి చేసింది.  ఈ ప్రాజెక్ట్ ఈనెల 21 వ తేదీన ప్రారంభోత్సవం చేస్తున్నారు.  ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్ ను స్వయంగా కలిసి ఆహ్వానించారు.  


అటు ప్రధాని మోడీని కూడా ఈ ప్రారంభోత్సవానికి ఆహ్వానిస్తున్నారు.  మోడీ ఈనెల 21 వ తేదీన తెలంగాణా వస్తున్నట్టు దాదాపుగా కన్ఫర్మ్ అయ్యినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటె, కాంగ్రెస్ పార్టీ నేత భట్టి విక్రమార్క కాళేశ్వరం విషయంలో జగన్ అక్కడికి అడుగుపెడితే.. వైఎస్సాఆర్ ఆత్మా క్షోభిస్తుందని అంటున్నాడు.  


ప్రాజెక్టు ఆకృతి మార్పు, అవకతవకలకు పరోక్షంగా బాధ్యులు అవుతారని అన్నారు.  ఇక ప్రాజెక్ట్ టెండర్ల విషయంలో జగన్ చేసిన చేసిన వ్యాఖ్యలను స్వాగతించిన బట్టి, తెలంగాణా కాళేశ్వరం విషయంలో కూడా అలాగే జరగాలని పట్టుబట్టాడు.  ప్రాజెక్ట్ పూర్తయ్యి ప్రారంభం కాబోయే ముందు ఇలాంటి మాటలెండి అని కొందరు మండిపడుతున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: