చంద్రబాబును అందరూ ముద్దుగా యూటర్న్ బాబు అని పిలుస్తుంటారు. పూటకో మాట మార్చడం బాబు గారికే చెల్లింది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఇంకో యూటర్న్ తీసుకున్నారని ఎద్దేవా చేశారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి. కాంగ్రెస్, బీజేపీలకు సమదూరం పాటించాలని చంద్రబాబు నాయుడు డిసైడ్ చేసినట్టుగా వచ్చిన వార్తలపై విజయసాయి రెడ్డి ఇలా స్పందించారు.


మొన్నటి వరకూ బీజేపీ వ్యతిరేక కూటమి అంటూ చంద్రబాబు నాయుడు దేశమంతా తిరిగిన సంగతి తెలిసిందే. బీజేపీ వ్యతిరేక కూటమి అని, కాంగ్రెస్ తో కలిసి దాన్ని ఏర్పాటు చేయనున్నట్టుగా చంద్రబాబు నాయుడు ప్రజాధనంతో స్పెషల్ ఫ్లైట్ వేసుకుని తెగ తిరిగారు. ఆ కూటమి సంగతి ఏమైందో అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు యూటర్న్ తీసుకోక తప్పలేదు. ఈ అంశాన్ని విజయసాయి రెడ్డి ప్రస్తావించారు.


''ఎన్నికల షాక్ నుంచి తేరుకోకముందే చంద్రబాబు మరో యూ-టర్న్. ఇకపై కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యుపిఏలో కొనసాగరట. కేంద్రంపై పోరాటాలకు విరామం ఇస్తారట. అర్థమవుతోంది గదా... మోదీ, అమిత్షాకు మోకరిల్లే ప్రయత్నం అని. ముగ్గురు ఎంపీలతో ఆయన ఎన్ని యూ టర్నులు తీసుకున్నా పట్టించుకునే వారుండరు.'' అని ఈ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ చంద్రబాబు నాయుడును ఎద్దేవా చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: