పరిచయం అక్కర్లేని పేరు.  సిబీఐ మాజీ జేడి. ఆయన ఇటీవల పవన్ కళ్యాణ్ స్థాపించిన "జనసేన" పార్టీలో చేరి విశాఖపట్నం లోక్ సభ కి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో ఏపీ అసెంబ్లీకి, పార్లమెంట్‌కు ఎన్నికలు జరిగాయి. ఎన్నికల ప్రచారం ఊపందుకొన్న సమయంలోనే జేడీ లక్ష్మీనారాయణ జనసేనలో చేరారు. లక్ష్మీనారాయణ తొలుత టీడీపీలో చేరుతారని ప్రచారం కూడ సాగింది. అయితే ఈ ప్రచారం సాగిన సమయంలో వైసీపీ తీవ్ర విమర్శలు చేసింది.

 

ఈ సమయంలో తాను ఏ రాజకీయ పార్టీలో చేరుతానో త్వరలోనే ప్రకటిస్తానని లక్ష్మీనారాయణ ప్రకటించారు. కానీ ఎవరూ ఊహించని విధంగా ఆయన జనసేన పార్టీ లో చేరారు. విశాఖ నుండి లోక్ సభకి పోటీ చేసారు.  భారీ ఓటమి మూటగట్టుకున్నారు.  ఆయన తన భవిష్యత్ కార్యాచరణ గురించి త్వరలో నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం. తన చూపు బీజేపీ వైపు ఉందని తన సన్నిహిత వర్గాల నుండి సమాచారం. అయితే దీనిపై ఇంకా స్పష్టత రాలేదు.

 

బీజేపీ కూడా లక్షీనారాయణని ఆహ్వానించడానికి సిద్ధంగా ఉందట. లక్షీ నారాయణ చేరితే ఆ పార్టీకి ఆంధ్రపదేశ్ లో మైలేజి ఇంకా పెరుగుతుందని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో బీజేపి పరిస్థితి ఏ విధంగా ఉందో అందరికీ తెలిసిందే. అందుకని లక్ష్మీ నారాయణ ని తమ పార్టీలోకి తీసుకు రావడానికి ప్రయత్నిస్తున్నారని సమాచారం.

 

అయితే ఈ వార్తపై ఇంకా ఎటువంటి స్పందన రాలేదు. అటు లక్ష్మీ నారాయణ నుండి కానీ, బీజేపి నుండి కానీ ఎటువంటి రియాక్ష్న్ రాలేదు. నాయకులు పార్టీలు మారడమన్నది సర్వ సాధారణం. ఎమ్మేల్యేలు సైతం పార్టీలు మారుతుంటారు. ఇటువంటి సందర్భంలో లక్ష్మీ నారాయణ పార్టీ మారి పవన్ కళ్యాణ్ కి షాకిస్తాడా అనేది చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: