ప్రసుత్తం ప్రతి ఒక్క తమ విధ నిర్వహణ చేస్తూనే ఉంటారు. అందులో ముఖ్యమైనది, అత్యంత కీలకమైనది పోలీస్ వృత్తి. ఎంతో మంది ఆశలతో పోలీస్ అవ్వాలనుకుంటారు. విధి నిర్వాహణ చేరాక తమకు ఒక్క రోజు కూడా సెలవు లేకుండా పని చేస్తారు. కుటుంబ సభ్యులతో కూడా కలిసి ఆనందంగా గడిపే క్షణాలు కూడా తక్కువే... ఇందుకోసం ఏపీ ప్రభుత్వం నూతన విధానాన్ని అమలు పర్చనుంది.

సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణకు అనుక్షణం కృషి చేసే పోలీసులకు అధికారికంగా సెలవు లేకపోవడం దురదృష్టకరమని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత వ్యాఖ్యానించారు. దీన్ని ముఖ్యమంత్రి జగన్ గుర్తించారని తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు త్వరలోనే వారికి వారంతపు సెలవుని (వారంలో ఏదైన ఒక్ రోజు మాత్రమే) అమలు చేయాలని నిర్ణయించినట్లు ఆమె ప్రకటించారు.

ఆదివారం సచివాలయంలోని తన చాంబర్లో సుచరిత లాంఛనంగా ప్రవేశించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికడతామని హామీ ఇచ్చారు.  శాంతి భద్రతలు కాపాడి ప్రజలకు భద్రతపై భరోసా కల్పిస్తామని తెలిపారు. మహిళా బెటాలియన్, గిరిజన బెటాలియన్ ఏర్పాటు చేస్తామన్నారు.

మహిళల భద్రత కోసం ప్రత్యేక టోల్‌ ఫ్రీ నెంబర్‌ ఏర్పాటు చేస్తామని హోంమంత్రి స్పష్టం చేశారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థను తీసుకొస్తామని చెప్పారు. దళిత మహిళకు హోంమంత్రి పదవి ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి సుచరిత కృతజ్ఞతలు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: