వైద్యులు, వైద్య సిబ్బందిపై దాడులు జరగకుండా కేంద్రం చట్టాన్ని తీసుకురావాలని ఐఎంఏ డిమాండ్‌ చేస్తోంది. సమ్మెలో 3.5 లక్షల మంది వైద్యులు పాల్గొననున్నారు. కోల్‌కతాలో జూనియర్‌ వైద్యులపై దాడులకు నిరసనగా దేశ వ్యాప్తంగా వైద్యుల సమ్మెకు ఐఎంఏ పిలుపునివ్వడంతో,  వైద్యుల సమ్మె నిర్వహణ కారణంగా ఆస్పత్రుల్లో ఎమర్జెన్సీ మినహా ఇతర వైద్య సేవలు నిలిచిపోనున్నాయి. దేశ వ్యాప్తంగా సోమవారం కూడా వైద్యులు సమ్మె కొనసాగిస్తున్నారు.

24 గంటల పాటు అన్ని రకాల వైద్యసేవలను బహిష్కరించనున్నారు. వైద్యులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నాయంటూ ఇండియన్ మెడికల్ అసోషియేషన్ నిరసనకు పిలుపునిచ్చింది. పశ్చిమ బెంగాల్‌లో వైద్యులపై దాడులు జరిగిన నేపధ్యంలో సోమవారం అన్ని రకాల వైద్యసేవలను నిలిపివేస్తున్నట్టు సంస్ధ ప్రతినిధులు ప్రకటించారు. ఈ సమ్మెకు తెలంగాణలోని పలు ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రులు మద్దతు ప్రకటించాయి.

ఇటు పశ్చిమ బెంగాల్‌లో జరుగుతున్న జూనియర్‌ డాక్టర్ల ఆందోళన ఆరో రోజుకు చేరుకుంది. ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య సిబ్బందికి రోగుల నుంచి భద్రత కల్పించాలన్న తమ డిమాండ్‌ నెరవేరే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆహ్వానం మేరకు చర్చలు జరపడానికి తాము సిద్ధమన్న జూడాలు దానికన్నా ముందు ఆందోళన జరుగుతున్న ఎన్‌ఆర్‌ఎస్‌ మెడికల్‌ కాలేజ్‌ను సీఎం మమతా బెనర్జీ సందర్శించాలని డిమాండ్‌ చేస్తున్నారు. అయితే డాక్టర్ల డిమాండ్‌కు ప్రభుత్వం ఒప్పుకుంటుందనీ, వెంటనే విధుల్లోకి చేరాలని మమత కోరారు. అలాగే ఆందోళన చేస్తున్న వైద్యులపై ఎలాంటి చట్టాలను ప్రయోగించబోమనీ హామీ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: