జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వం కొత్త కాన్వాయ్ ను ఏర్పాటు చేసింది. గతంలో టాటా సఫరా వాహనాలు ఉండేవి. అయితే వాటిని హైదరాబాద్ లో ఉంచేసిన కారణంగా జగన్ కు కొత్తగా ఆరు టయోటా ఫార్చూనర్ వాహనాలను ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇందులో బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు కూడా ఉన్నాయి.

 

గతంలో జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నపుడు మూడు టాటా సఫారీలు ఉండేవి. అవి కూడా చాలా పాతవి. అందులో ఒకటి మాత్రమే బుల్లెట్ ప్రూఫ్ వాహనం. అందులో ఏసి సౌకర్యం కూడా సరిగా ఉండేది కాదు. పైగా వాహనం కూడా పాతది కావటంతో ఎక్కడికక్కడ ఆగిపోతుండేది. తనకు కొత్త వాహనం కావాలని జగన్ ఎన్నిసార్లు ప్రభుత్వాన్ని అడిగినా పట్టించుకోలేదు.

 

సరే సీన్ రివర్స్ అయి జగన్ సిఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రభుత్వం కొత్తగా ఆరు వాహనాలను సమకూర్చింది.  అయితే జగన్ తరచూ హైదరాబాద్ కు కూడా వస్తుండటంతో హైదరాబాద్ లో కూడా కాన్వాయ్ అవసరం ఏర్పడింది. దాంతో ఆ ఆరు వాహనాలను ప్రభుత్వం హైదరాబాద్ లో ఉంచేసింది.

 

అందుకనే విజయవాడలో కొత్తగా మరో ఆరు నలుపు రంగు టయోటా ఫర్చూనర్ వాహనాలను కొనుగోలు చేసింది. ఇందులో మూడూ బుల్లెట్ ప్రూఫ్ వాహనాలున్నాయని పార్టీ వర్గాలు చెప్పాయి.  AP 39 PA 2345 నెంబర్ ను రవాణా శాఖ కేటాయించింది. భద్రతా కారణాల దృష్ణ్యా అన్ని కార్లకు ఒకటే నెంబర్ ఉంటుంది.

 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: