అధికారంలోకి రావడం ముఖ్యం కాదు.. అధికారంలోకి వచ్చిన తరువాత ఎలా పరిపాలించామన్నది ముఖ్యం.  రాజకీయాల్లో అనుభవం లేదని, పాలన విషయంలో జగన్ ఏం చేయగలుగుతాడని అందరు అనుకున్నారు.. కానీ, జగన్ అందరి అనుమానాలను పటాపంచలు చేస్తూ.. శభాష్ అనిపించే విధంగా పాలన చేస్తున్నాడు. 

 

అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ.. కేంద్రంలో పెండింగ్ లో ఉన్న బిల్లులను తెప్పించుకుంటున్నారు.  ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అన్ని రకాల మార్గాలను అన్వేషణ చేస్తున్నారు.  పెండింగ్ లో ఉన్న పోలవరం నిధులను సైతం తెప్పించుకోగలిగారు జగన్. 

 

ఇవే కాకున్నా పోలవరం నుంచి ఇంకా పెండింగ్ లో ఉన్న 1929 కోట్లు, కేంద్ర గ్రామీణాభివృద్ధి సంస్థ నుంచి 738 కోట్లు, కేంద్ర స్కీమ్స్ కింద 538 కోట్లు రాష్ట్రానికి రాబోతున్నాయి.  ఇవే కాకుండా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన ప్రతి రూపాయిని తెచ్చుకోగలుగుతున్నారు.  ఇలా తెచ్చుకోవడంలో జగన్ సఫలం అయ్యారు. 

 

కేంద్రంతో మంచిగా ఉంటె నిధులు వస్తాయి. కొట్లాటకు దిగితే.. రావాల్సిన మొత్తం ఆగిపోతుంది.  ఫలితం అభివృద్ధి క్షిణిస్తుంది.  పర్సనల్ గా ఎన్ని గొడవలైనా ఉండొచ్చు..దానిని పరిపాలన వైపుకు మరల్చకూడదు.  జగన్ చేస్తున్నది అదే.  అందుకే జగన్ ను అందరు మెచ్చుకుంటున్నారు.  40 సంవత్సరాల అనుభవం ఉన్న బాబు పదిరోజుల పరిపాలనా అనుభవం ఉన్న జగన్ ముందు ఓడిపోయాడు అనడానికి ఇదొక నిదర్శనం.


మరింత సమాచారం తెలుసుకోండి: