తెలంగాణ సభ్య సమాజం సిగ్గుపడాల్సిన అమానవీయ సంఘటన ఇది. 

నిర్మల్‌ జిల్లా కడెంలోని ఒడ్డెర కాలనీకి చెందిన పుట్ట గంగ జ్యోతి, నవీన్‌ దంపతులకు ఒక అమ్మాయి. మేస్త్రీ పని చేసే నవీన్‌ ఐదు నెలల క్రితం భార్య, బిడ్డలను వదిలి వెళ్లి పోయాడు. దీంతో గంగ జ్యోతి బతుకు తెరువు కోసం, చెత్తపేపర్లు, ప్లాస్టిక్‌ కవర్లు, సేకరించి విక్రయిస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది.


నవీన్‌ వెళ్లిపోయిన సమయంలో ఆమె గర్భవతి కాగా, నెల క్రితం ఆడపిల్లను ప్రసవించింది. భర్త విడిచి వెళ్లిపోయాడు.. ఆడ పిల్ల పోషణ భారంగా మారింది... మళ్లీ ఆడ పిల్ల జన్మించడంతో పెంచే స్తోమతు లేక ఆ తల్లి పేగు తెంచుకొని పుట్టి నెల రోజుల వయసు కూడా లేని బిడ్డను అమ్మకానికి పెట్టింది. 


ఈ ఘోర ఘటన జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో కలకలం రేపింది. ఆ పేద తల్లి, కళానగర్‌ ప్రధాన వీధిలోని ఓ దుకాణం మెట్లపై కూర్చొని చిన్నారిని రూ.20 వేలకు అమ్మకానికి యత్నించింది. స్ధానికులు పోలీసులకు సమాచారమివ్వడంతో వారు తల్లి, శిశువును ప్రత్యేక వాహనంలో జగిత్యాల ఐసీడీఎస్‌, పిల్లల సంరక్షణ కేంద్రానికి అప్పగించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: