Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Jul 20, 2019 | Last Updated 12:52 am IST

Menu &Sections

Search

రాజగోపాల్ రెడ్డి తో కలిసి నడిచేది ఎవరెవరు ?

రాజగోపాల్ రెడ్డి తో కలిసి నడిచేది ఎవరెవరు ?
రాజగోపాల్ రెడ్డి తో కలిసి నడిచేది ఎవరెవరు ?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

తెలుగు రాష్ట్రాల్లో బలోపేతమే లక్ష్యంగా కమలనాథులు వ్యూహాలు రచిస్తున్నారు. అందులో భాగంగా తొలుత తెలంగాణ లో ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించాలని నిర్ణయించారు . కాంగ్రెస్ లోని అసంతృప్త నేతలను లక్ష్యంగా చేసుకుని, వారిని తమ గూటికి చేర్చుకోవాలని భావిస్తున్నారు. ఎన్నికల ముందు మాజీ మంత్రి డీకే అరుణ, మహబూబ్ నగర్ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి , ప్రస్తుత ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు   వంటి వారిని చేర్చుకున్న కమలనాథులు, కేంద్రం లో అధికారం లోకి రావడం, తెలంగాణ లో నాలుగు స్థానాలు గెల్చుకోవడం తో రెట్టించిన ఉత్సాహం తో ఇతర పార్టీల నేతలను తమతో కలుపుకుని తెలంగాణ లో బలపడాలని చూస్తున్నారు.


రాష్ట్రం లో అధికారం లో ఉన్న టీఆరెస్ నేతలు ఇప్పటికిప్పుడు తమ పార్టీ లో చేరే అవకాశం లేదని భావిస్తోన్న కాషాయ నేతలు, కాంగ్రెస్, టీడీపీ నేతలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. టీడీపీ కి చెందిన సీనియర్ నేత పెద్దిరెడ్డి, చాడ సురేష్ రెడ్డి లో కమలం గూటికి చేరేందుకు సుముఖంగా ఉండగా, ఇక మిగిలిన నేతలు కూడా తమ దారి తాము చూసుకునే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. టీడీపీ తో పాటు కాంగ్రెస్ లో అసంతృప్తి తో ఉన్న వారిని లక్ష్యంగా చేసుకున్న బీజేపీ నాయకత్వానికి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చిక్కారు. రాజగోపాల్ రెడ్డి తాను బీజేపీ లో చేరబోతున్నట్లు పరోక్షంగా చెప్పారు. కార్యకర్తలతో, కుటుంబ సభ్యులతో చర్చించి పార్టీ మార్పు పై నిర్ణయం తీసుకుంటానని వెల్లడించడం ద్వారానే తాను బీజేపీ లో చేరడం లాంఛనమేనని తేల్చేశారు.


అయితే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక్కరే కమలం గూటికి చేరుతారా? లేకపోతే తనతోపాటు సోదరుడు, భువనగిరి ఎంపీ వెంకట్ రెడ్డి ని కూడా తీసుకువెళ్తారా ? అన్నది హాట్ టాఫిక్ మారింది. వెంకట్ రెడ్డి ఇప్పటి వరకు తన సోదరుడు చేసిన వ్యాఖ్యలను ఖండించకపోవడం చూస్తే ఇద్దరు కలిసి పయనం చేసే అవకాశాలే ఎక్కువగా కన్పిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి తనతో పాటు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ని కూడా బీజేపీ లోకి తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే జగ్గారెడ్డి గతం లో బీజేపీ నుంచే కాంగ్రెస్ లో చేరారు. విద్యార్థి దశ నుంచి ఆయన ఎబివిపి లో పనిచేశారు. గతం లో బీజేపీ తో విభేదించి కాంగ్రెస్ లో చేరిన జగ్గారెడ్డి, తిరిగి తన సొంత గూటికి వెళ్తారా ?, కాంగ్రెస్ లో కొనసాగుతారా ?? అన్నదానిపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ ను రేకెత్తిస్తోంది.


bjp-rajagopalreddy
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జక్కంపూడి ఫ్యామిలీని అక్కున చేర్చుకున్న జగన్
జగన్ ఎఫెక్ట్ ... బీజేపీ లోకి ఆగిన టీడీపీ నేతల  వలసలు
లోకేష్ అవినీతిని నిగ్గు తేల్చాలి ...
ఏటా ఇంటి పన్ను 100 ... రిజిస్ట్రేషన్ చార్జీలు ఒక రూపాయేనట
తన  లాంటి హీరో  ఉన్న టైటానిక్  పడవ మునుగుతుంది
 నెల రోజుల తరువాత వేధించారని  చెప్పడం ఏంటీ?
వరల్డ్ బ్యాంకు షాక్ ... రాజధాని నిర్మాణంపై నీలినీడలు
టీడీపీ కి గట్టి షాక్ ఖాయమే ... బీజేపీ లోకి మాజీ ఎంపీ
వైఎస్ తో ఉన్నది రాజకీయ విరోధమే .. వ్యక్తిగతం కాదు
థాంక్స్ జగన్ అంటున్న లోకేష్
హరిచందన్ కు రాజ్ భవన్ ఎక్కడ ?
ఎక్కడ మొదలయిందో... మళ్ళీ అక్కడికే
ఎదురుదాడితో ఎండగడుదాం ...
కేంద్రం చెప్పిన డోంట్ కేర్ ...
కేశినేని నాని స్కెచ్ అదుర్స్ ...
రాజేంద్రనాథ్ రెడ్డి తెలివైనవాళ్లు ...  హ్యాట్సాఫ్ అన్న బాబు
తక్కువకే  వస్తుంటే ..  ఎక్కువ ధరలకు ఎందుకు విద్యుత్ ఒప్పందాలు
చంద్రబాబు లక్ష్యంగా పోలవరంపై విచారణ ?
బీజేపీ లో చేరనున్న వైకాపా మహిళానాయకురాలు ?
బీజేపీ వైపు మాజీమంత్రి చూపు ?
వాళ్ళు బట్టలు విప్పుతుంటే ... నేను న్యూడ్ సీన్స్ లో నటిస్తే తప్పా
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.