కాగజ్‌నగర్‌ అడవుల్లో అసలేం జరిగింది..? తెలంగాణ, కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో పోడు భూములపై పీటముడి బిగుసుకుంటోంది. గోండు, కోలాం తదితర ఆదివాసీలు కొత్తగా సాగు చేసుకుంటు న్న పోడు భూములపై అటవీ శాఖ కన్నెర్ర చేస్తుండడంతో అటవీ అధికారులు, గిరిజనులకు మధ్య వివాదం నెలకొంది. ఇటీవల కాగజ్‌నగర్‌ మండలం గోంది గ్రామంలో 14 కోలాం కుటుంబాలను ఖాళీ చేయించిడంతో మానవ హక్కుల నాయకులు చొరవతో సమస్య హైకోర్టుకు చేరింది. వైఎస్‌ సీఎంగా ఉండగా పట్టాలు.. ఈ సమస్యకు రెవెన్యూ, అటవీ, గిరిజన సంక్షేమ శాఖల మధ్య సమన్వయలోపమే ప్రధాన కారణం. కుమరం భీం జిల్లాలో 2 లక్షల ఎకరాలకుపైగా పోడు వ్యవసాయం ఉంది. అటవీ భూములను సాగు చేసుకుంటున్న ఆదివాసీలకు వైఎస్‌ సీఎంగా ఉండగా 2006లోనే గరిష్ఠంగా ఐదెకరాలకు పట్టాలిచ్చారు. వాటిని లంబాడా గిరిజనులకు విక్రయించిన ఆదివాసీలు మళ్లీ కొత్తగా అడవుల్లేని డీ గ్రేడెడ్‌ అటవీ ప్రాంతంలో భూములు సాగు చేసుకుంటున్నారు. ........................ 1950కి ముందు నుంచి ఇక్కడ నివసిస్తున్న గిరిజనులతో పేచీ లేదని, ఆ తర్వాత వలస వచ్చిన గిరిజనులు ఆర్థిక దన్నుతో తమ భూముల్లో తమనే పాలేర్లుగా మారుస్తున్నారన్న అభద్రతాభావం ఆదివాసీల్లో నెలకొందని మేధావుల అంచనా... పోడు భూము ల సాగు వివాదానికి ఐటీడీఏ, గిరిజన సంక్షేమశాఖల వైఫల్యమే కారణం. గోంది సంఘటనలో ఈ రెండు శాఖలు సకాలంలో స్పందించి ఉంటే ఆదివాసీలను అటవీ అధికారులు ఖాళీ చేయించే పరిస్థితి ఉండేది కాదంటున్నారు..................... పోడు భూములను వదలం '' గత 20 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న పోడు భూములను వదులుకునే ప్రసక్తే లేదు. అటవీ అధికారుల దాడులు ఆదివాసీలను అడవుల నుంచి వెళ్లగొట్టే కేంద్రం కుట్రలో భాగమే. సుప్రీంకోర్టు తాజా తీర్పుపై ఆదివాసీ సంఘాలు దేశ వ్యాప్త ఉద్యమం చేస్తాయి...'' అంటారు,తుడుందెబ్బ ఉపాధ్యక్షుడు, సిడాం శంకర్‌. '' ఆదివాసీల హక్కుల పరిరక్షణలో ప్రభుత్వం చట్ట పరిధిలోనే పరిష్కారం కనుగొనాలి. వారి కోసం ఉన్న చట్టాలను సక్రమంగా అమలు చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఐటీడీఏను నిర్వీర్యం చేశారు. గిరిజన సంక్షేమ శాఖ కూడా సరిగ్గా వ్యవహరించడం లేదు. '' అంటున్నారు, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు, కోదండరాం, పోడు సాగు చేసుకుంటున్న రైతుల జోలికి వెళ్లడం లేదు. 2013-14 తరువాత కొత్తగా అడవులను నరికి సాగు చేసుకుంటున్న భూములను మాత్రమే ఖాళీ చేయిస్తున్నాం. వీటిని కూడా వదులుకోమంటే అడవులను వదులుకున్నట్లే ... అని వాదిస్తున్నారు..కుమరం భీం జిల్లా అటవీ అధికారులు 

మరింత సమాచారం తెలుసుకోండి: