ఏబి వెంకటేశ్వరరావు...కొత్తగా పరిచయం అవసరం లేని ఐపిఎస్ అదికారి. చంద్రబాబునాయుడు హయాంలో ఓ వెలుగు వెలిగారు. ఆయన ప్రభ ఏ స్ధాయిలో వెలిగిందట మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంపిలకన్నా వెంకటేశ్వరరావు చెప్పిందే చంద్రబాబు వేదంలాగ భావించేవారు.

 

సీన్ కట్ చేస్తే మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబు ఘోర పరాజయం తర్వాత ప్రస్తుతం ఏబి పరిస్ధితేంటి ? ఏమిటంటే పోస్టింగ్ కోసం ఏబి జిఏడిలో వెయిట్ చేస్తున్నారు. పోస్టింగ్ ఎప్పుడొస్తుందో తెలీదు ? ఇచ్చినా ఏమి పోస్టింగ్ ఇస్తారో తెలీదు. ఓ వెలుగు వెలిగిన ఏబి పరిస్ధితి ఎందుకిలా అయిపోయిందంటే అంతా ఆయన స్వయంకృతమనే చెప్పాలి.

  

చంద్రబాబు హయాంలో ఏబి ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉండేవారు. తాను ఓ ఐపిఎస్ అధికారినన్న విషయం మరచిపోయి చంద్రబాబు కోటరిలో ప్రముఖునిగా, టిడిపి నేతగా చెలామణి అయిపోయారు. దాంతో ఆయన సేవలంతా వైసిపి ప్రజా ప్రతినిధులను వేధించటానికే సరిపోయింది. వైసిపి తరపున గెలిచిన 23 మంది ఎంఎల్ఏలు, ముగ్గురు ఎంపిలు టిడిపిలోకి ఫిరాయించటంలో ఏబిదే ప్రముఖ పాత్ర.

 

ఫిరాయింపుల విషయంలోనే కాకుండా మంగళగిరి ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి లాంటి అనేక మందిని అనేక రకాలుగా తీవ్ర ఒత్తిడిలోకి నెట్టేశారు. చంద్రబాబుకు కంటిలో నలుసులాగ తయారైన వైసిపి ఎంఎల్ఏలపై షాడో ఇంటెలిజెన్స్ ను ఉపయోగించి ఎన్నో రకాలుగా వేధించారు.  అనధికారికంగా  ఫోన్లను ట్యాప్ చేయించారు. సరే ఎప్పుడైతే ఎన్నికల్లో టిడిపి బొక్కబోర్లా పడిందో అప్పటి నుండే ఏబికి కూడా కష్టాలు మొదలయ్యాయి.

 

డిజిపిగా పనిచేసిన ఆర్పీ ఠాకూర్ కే కష్టాలు తప్పలేదు ఇక ఏబి ఎంత ? అందుకే ప్రస్తుతం పోస్టింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. నిజానికి ప్రభుత్వంలో ఎవరున్నా రూల్ ప్రకారం తాము చేయాల్సిన పనులు మాత్రమే చేస్తే ఏ అధికారికి కూడా సమస్యలు రావు. కానీ తాము అధికారపార్టీకి తొత్తులమని, పార్టీలో తాము కీలక నేతలమన్న భావనతో పనిచేస్తేనే సమస్యలు వస్తాయి. అందుకు ఏబినే తాజా ఉదాహరణ. అందుకే ఎవ్వరైనా సరే తమ పరిమితికి మించకుండా ఉంటేనే బాగుంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: