వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్లో టిడిపి నేతలు, కార్యకర్తలపై దాడులు పెరిగిపోతున్నాయి అని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.  ఈ దాడుల్లో ఇప్పటివరకు 5 గురు పైగా చనిపోయారని సాక్షాత్తు ఆ పార్టీ అధినేత చంద్రబాబు విమర్శించారు..  మరో 70 వరకు దాడులు జరిగాయని ఆయన అన్నారు.

 

చిన్న బాబు లోకేష్ కూడా దాడులపై స్పందించారు.  రాజన్న రాజ్యం అంటే ఇదేనా అంటూ ప్రశ్నించారు.  నిజంగానే వైసీపీ నేతలు టిడిపి నాయకుల పై దాడులు చేస్తున్నారా..  అరాచకం సృష్టిస్తున్నారా...  అంటే అలాంటిదేమీ లేదు అంటున్నారు వైసీపీ నేతలు.

 

నెల్లూరు జిల్లాలకు చెందిన వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి టీడీపీ ఆరోపణల లోని  అవాస్తవాలను బయటపెట్టారు.  తన జిల్లాలో వైసిపి నాయకులు ఓ టిడిపి కార్యకర్తను  హత్య చేశారని  పార్టీ నేతలు ఆరోపించారని కాకాని చెప్పారు.  కానీ తాము క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలన జరపగా  అసలు వాస్తవం బట్టబయలైంది.

 

టిడిపి నేతల చెబుతున్నట్టుగా జరిగిన హత్య రాజకీయ కారణాలతో జరిగింది కాదని హతుడి భార్య అక్రమ సంబంధం కారణం గా భర్తని చంపిందని వైసీపీ నేతలు  చెబుతున్నారు.  ఈ మేరకు ఈనాడు ప్రత్యేక తో పాటు పలు పత్రికల్లో వచ్చిన వార్తల క్లిప్పింగులను  కాకాని గోవర్ధన్ రెడ్డి మీడియా సమావేశంలో చూపించారు.  టిడిపి చెబుతున్న దాడులన్నీ  దాదాపు  ఇలాంటివే నని ఆయన ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: