తుఫాను వంటి పెద్ద పెద్ద గండాలను తట్టుకొని నిలబడ్డ కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు పిల్లకాలువను చూసినా బయపడిపోవలసిన పరిస్థితి వచ్చింది.  దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పరిస్థితి ఇప్పుడు ఇలాగే ఉన్నది.  ఎక్కడ చూసినా కాంగ్రెస్ పార్టీ బలం దారుణంగా ఉన్నది.  ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయపడుతున్నారు.

ఇదిలా ఉంటె, కాంగ్రెస్ పార్టీ నుంచి చాలామంది నేతలు తెరాస లోకి జంప్ అయ్యారు.  దాదాపు 12 మంది ఎమ్మెల్యేలు జంప్ అయ్యారు.  మిగిలిన ఆరుగురిలో నలుగురు బీజేపీలోకి వెళ్లేందుకు పావులు కదుపుతున్నారు.  ఎవరెలా పొతే నాకేంటి అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ చూస్తున్నది.  


నాలుగు ఎమ్మెల్యేలతో పాటు ఇద్దరు ఎంపీలు కూడా పార్టీలు మారే ఆలోచనలో ఉన్నారు.  ఇంతవరకు బాగానే ఉంది.  ఇప్పటి వరకు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలను లాక్కున్న తెరాస కు బీజేపీ షాక్ ఇచ్చేలా కనిపిస్తోంది.  తెరాస లో ఉన్న కొంతమంది అసమ్మతి వాదులు బీజేపీ వైపు చూస్తున్నారు.  


బీజేపీలో ఆయా నాయకులు చేరిపోయేందుకు రెడీ అవుతున్నారని సమాచారం.  అయితే ఎవరు వాళ్ళు అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉన్నది. అందరిని పార్టీలోకి ఆహ్వానిస్తుంటే... ఇప్పుడు కొంతమంది పార్టీలు మారిపోవడానికి సిద్ధం కావడం ఎంతవరకు శ్రేయస్కరం అన్నది అర్ధంకాని ప్రశ్న. దీనిపై కెసిఆర్ ఇప్పటి వరకు ఒక్క మాటకూడా మాట్లాడలేదు.  తెరాస నేతలు కొంతంమంది టచ్ లో ఉన్నారని చెప్పినా.. కెసిఆర్ సైలెంట్ గా ఉన్నారంటే అర్ధం ఏంటి... ?


మరింత సమాచారం తెలుసుకోండి: