- రైతులను గౌరవించే దిశగా సామాజిక చైతన్య కార్యాచరన
ఇటీవల కాలంలో మహర్షి అనే సినిమా వచ్చింది. పూర్తిగా రైతు ఆధారిత చిత్రం. గతంలో ఖైదీ150 కూడా అదే కోవకి చెందినది. ఆ సినిమాలు వచ్చినపుడు సినిమాల యూనిట్ వారందరూ రైతులంటే తమకి  అమితమైన ప్రేమానురాగాలు ఆదరాభిమానాలు ఉన్నాయనీ అసలు సినిమా తమ లాభాలకోసం కాకుండా రైతులని ఉధ్దరించేందుకే తీశామని పేర్కొన్నారు. సినిమా లాభాలు గడించాక డబ్బులు మూటగట్టుకుని వారి దారిన వారు వెళ్ళిపోయారు. మళ్ళీ రైతు మొహం వంక చూసిన పాపాన పోలేదు.


సినిమా అనేది కల్పితం, వారి లాభాల కోసం మనకి లేనిది ఉన్నట్టు, చేయనిది చేసినట్టు, జరగనిది జరిగినట్లు చూపే మాయా ప్రపంచం.  వారికది వ్యాపారం. రైతు కోసం చేయనిది చేసినట్లు చూపిన హీరోలని మనం పూజిస్తున్నాము. వాస్తవంగా పొలంలో రక్తాన్ని చమటగా పారిస్తున్న రైతుని విస్మరిస్తున్నాము. వారు ఏసీ రూములలో మనకి భ్రమలు కల్పిస్తే ఉప్పొంగిపోయి కేకలూ కేరింతలు ఈలలు వేస్తున్నాం,  ఎండనక వాననక పరితపించే రైతుని హీనంగా చూస్తున్నాము.

వారి నటన చూస్తే కడుపు నిండదు పొద్దున టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రి భోజనం, మధ్యలో టీ కాఫీ చిట్ ఎలా ఏది కావాలన్నా రైతు పండించిన వస్తువులే కీలకం, అంతేందుకు మనిషి బ్రతికి వుండాలంటే గాలి, నీరు ఆహారం కావాలి. ఆహారం అందించేది రైతు. అంటే మనం బ్రతికి వుండాలంటే కావలసిన ఆహారం అందించేవాడు రైతు. అతనిని మనం విస్మరిస్తున్నాం. మనం ఉద్యోగం చేయవచ్చు, వ్యాపారం చేయవచ్చు,  సినీమా షికార్లకి వెళ్ళవచ్చు, ఏది చేయాలన్నా జీవించి వుండటానికి ఆహారం ముఖ్యం. అది అందించే రైతుని గౌరవించటం మనందరి బాధ్యత. 


జూన్‌ 17న ఏరువాక పౌర్ణమి. అంటే రైతు తన వ్యవసాయ పనులు ఆరంభించే రోజు.  ఈ రోజున సమీప గ్రామంలో కొందరు రైతులని సందర్శించి, వారు మానవాళికి ఆహారం అందించే దిశగా చేస్తున్న కృషికి ధన్యవాదములు తెలిపి, వారికి రానున్న పంటలకి శుభాకాంక్షలు తెలిపి వారిపట్ల గౌరవం చాటుకోవటం మనందరి కర్తవ్యం. కావున ప్రతీ ఒకరూ ఈ దిశగా కొందరు రైతులని సందర్శించే ప్రయత్నం చేయాలి.

రేపు వీలు పడనివారు ఓ నెల లోపు వీలు చూసుకుని ఈ కార్యక్రమం తలపెట్టవచ్చు. అవకాశం వున్న ప్రతీ ఒకరూ జూన్, జూలై నెలలలో తమ స్వగ్రామంలో గానీ తమ సమీప గ్రామంలో గానీ రైతులని సందర్శించి వారిని గౌరవించే అవకాశం పరిశీలించ మనవి. ఇది కుటుంబం తో గానీ బంధు మితృలతో గానీ ఓ పిక్నిక్ వలే చేపట్టవచ్చని సామాజిక చైతన్య కార్యాచరన వేదిక సభ్యలు సోషల్‌ మీడియా వేదికగా ప్రచారం విస్తృతం చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: